హోమ్ /వార్తలు /క్రైమ్ /

Suryapet : కూతురు అలా మంచంపై ఉండగా తల్లిని కామ కోరిక తీర్చమన్నాడు.. ఆ రాత్రి జరిగింది చూసి తట్టుకోలేక..

Suryapet : కూతురు అలా మంచంపై ఉండగా తల్లిని కామ కోరిక తీర్చమన్నాడు.. ఆ రాత్రి జరిగింది చూసి తట్టుకోలేక..

కూతురి మృతదేహం వద్ద తల్లి రోదన

కూతురి మృతదేహం వద్ద తల్లి రోదన

కూతురి ప్రాణాలు కాపాడాలంటే తల్లి మానం ప్రతిఫలంగా కావాలంటూ ఓ కీచక బాబా వికృతానికి పోయాడు. అందుకా తల్లి నిరాకరించగా.. రాత్రిరాత్రే కూతురు ప్రాణాలు కోల్పోయింది. కామ వాంఛ తీర్చలేదనే కోపంతోనే ఆ బాబా గాడు మంత్రాలు వేసి తన కూతుర్ని హతమార్చాడంటూ చివరికి పోలీసులను ఆశ్రయించిందా తల్లి..

ఇంకా చదవండి ...

అక్షరాస్యత ఇంకా అరవై శాతం కూడా చేరని తెలంగాణలో.. పల్లె పల్లెనా మంత్రగాళ్లు, ప్రతి ఊళ్లో ఫేక్ బాబాలకు గిరాకీ తగ్గడం లేదు. తమ సమస్యలు తీర్చుతారనే నమ్మకంతో పేద జనం ఇప్పటికీ మాయగాళ్లను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కూతురి ప్రాణాలు కాపాడాలంటే తల్లి మానం ప్రతిఫలంగా కావాలంటూ ఓ కీచక బాబా వికృతానికి పోయాడు. అందుకా తల్లి నిరాకరించగా.. రాత్రిరాత్రే కూతురు ప్రాణాలు కోల్పోయింది. కామ వాంఛ తీర్చలేదనే కోపంతోనే ఆ బాబా గాడు మంత్రాలు వేసి తన కూతుర్ని హతమార్చాడంటూ చివరికి పోలీసులను ఆశ్రయించిందా తల్లి. బాదిత కుటుంబం ఫేక్ బాబా నివసించే దర్గాను చుట్టుముట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి చివ్వెంల పోలీసులు చెప్పిన వివరాలివి..

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, రాజేశ్వరి దంపతులు పెద్దగా చదువుకోలేదు. తమకేదైనా సమస్య వస్తే వారు గాంధీ నగర్ సమీపంలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసేవాళ్లు. ఆ దర్గా నిర్వాహకుడైన భిక్షపతి ఇచ్చే నాటు మందులు వాడేవారు. కొన్నేళ్లుగా రాజేశ్వరి దంపతులు దర్గాకు వస్తూ పోతుండటంతో దర్గా నిర్వహకుడు భిక్షపతి కన్ను ఆమెపై పడింది. అవకాశం కోసం అతను ఎదురుచూస్తుండగా, ఇటీవల రాజేశ్వరి కూతురు శ్రావణి(20) అనారోగ్యానికి గురైంది. ఎప్పటిలాగే ఆ దంపతులు ఆస్పత్రికి కాకుండా భిక్షపతి దర్గాకు కూతుర్ని తీసుకొని వెళ్లారు. మంత్రించిన పసరు మందు ఇచ్చి నాటు వైద్యం చేస్తున్నట్లుగా నటిస్తూ.. అదే సమయంలో రాజేశ్వరిని లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. కూతురు అలా దీనంగా మంచంపై పడుకొని ఉండగా, తల్లి రాజేశ్వరి దు:ఖిస్తుండగా భిక్షపతి తాను ఆశిస్తున్నదేంటో ఆమెకుచెప్పేశాడు. కానీ అందుకామె నిరాకరించింది. అంతేకాదు, ఫేక్ బాబా దర్గాలో ఉండటం మంచిదికాదని భావించి కూతుర్ని తీసుకుని ఇంటికెళ్లిపోయింది. కానీ..

రోజూ మధ్యాహ్నం కోడలిని అలా చూస్తూ తట్టుకోలేక అత్తమామల అకృత్యం -అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారునాలుగు రోజుల కిందట శ్రావణికి మళ్లీ అనారోగ్యం ముదిరి, కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో భర్త దుర్గయ్య, ఇతర కుటుంబీకుల ఒత్తిడి మేరకు రాజేశ్వరి తన కూతుర్ని వెంటేసుకుని మళ్లీ భిక్షపతి దర్గాకు రాలేక తప్పలేదు. ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకున్న కీచక బాబా.. వైద్యానికి ఒక రోజు సరిపోదని, శ్రావణిని రాత్రంతా దర్గాలోనే అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పాడు. అతని మాటు నమ్మిన దుర్గయ్య.. భార్యాబిడ్డను దర్గాలోనే ఉండమని చెప్పి ఇంటికెళ్లిపోయాడు. అలా తనకు ఎవరూ అడ్డురాకుండా చూసుకొని రాత్రి వేళ మరోసారి రాజేశ్వరి దగ్గరికెళ్లాడు..

Omicron : ఒమిక్రాన్ దెబ్బకు వ్యాక్సినేషన్‌లో భారీ మార్పు! -మోదీ సర్కార్ ఏం చేయబోతోందటే..‘నా కోరిక తీరుస్తేనే నీ కూతురి ప్రాణాలు కాపాడుతాను.. ఈ రాత్రికే అది జరగాలి.. లేకుంటే నా సంగతి తెలుసుకదా..’అని రాజేశ్వరికి అల్టిమేటం ఇచ్చాడు దర్గా నిర్వాహకుడు భిక్షపతి. ఓవైపు కూతురి దుస్థితి, మరోవైపు భర్త అమాయకత్వం, ఇటు చూస్తే బాబాగాడి కీచకం.. అన్నీ తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన రాజేశ్వరి చివరికి వాడిని ఛీకొట్టింది. వాడి ప్రతిపాదనకు నో చెప్పింది. ఒకవేళ బలవంతపెడితే గట్టిగా కేకలు వేసి అందరినీ పిలుస్తానని రాజేశ్వరి అనడంతో భిక్షపతి వెనక్కి తగ్గాడు. భయంభయంగానే ఆ రాత్రి గడిచింది. కానీ తెల్లారేసరికి శ్రావణి ప్రాణాలు కోల్పోయింది. కోరిక తీర్చని కారణంగానే తన కూతురిపై మంత్రాలు వేసి భిక్షపతే చంపేశాడంటూ రాజేశ్వరి బోరున విలపించింది. విషయం తెలుసుకున్న దుర్గయ్య తన బంధువులు, గ్రామస్తులతో కలిసి దర్గాను ముట్టడించి, బాబాపై దాడికి ఉరికారు. పోలీసులు ఎంటరై దర్గా నిర్వాహకుడు బిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. కూతురు మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయిన రాజేశ్వరి దంపతులు.. మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.

First published:

Tags: Crime news, Suryapet, Telangana crime news

ఉత్తమ కథలు