• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • YOUNG WOMEN DROWNING YOUNG MEN IN PURSUIT OF MATRIMONIAL SITES IN TELUGU STATES MS BK

మ‌త్తుగా మాట్లాడ‌తారు.. చిత్తుగా ముంచుతారు.. మ్యాట్రిమోని సైట్ల మాటున హనీట్రాప్

మ‌త్తుగా మాట్లాడ‌తారు.. చిత్తుగా ముంచుతారు.. మ్యాట్రిమోని సైట్ల మాటున హనీట్రాప్

ప్రతీకాత్మక చిత్రం

అంద‌మైన అమ్మాయి ఫోటోలు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ల్లో పెట్ట‌డం.. తాను ఉన్న‌త‌మైన ఉద్యోగం చేస్తోన్నాన‌ని క‌ల‌రింగ్ ఇచ్చుకోవ‌డం.. మంచి వరుడు కావాలని.. ఈ ఉచ్చులో ప‌డిన వారిని నిండా ముంచి అందిన‌కాడికి దోచుకుపోవ‌డం ఇప్పుడు న‌గ‌రంలో న‌డుస్తోన్న ట్రెండ్.

 • News18
 • Last Updated:
 • Share this:
  మ‌త్తుగా మాట్లాడ‌తారు.. క‌వ్విస్తారు.. న‌వ్విస్తారు.. తీరా విష‌యం తెలుసుకునే లోపు మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దంతా దోచుకోపోతారు. న‌గ‌రంలో కొంత మంది యువ‌త‌లు ఇప్పుడు ఎంచుకున్న ట్రెండ్ ఇది.. అంద‌మైన అమ్మాయి ఫోటోలు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ల్లో పెట్ట‌డం.. త‌న‌కు మంచి వ‌రుడు కావాలని.. తాను ఒక ఉన్న‌త‌మైన ఉద్యోగం చేస్తోన్నాన‌ని క‌ల‌రింగ్ ఇచ్చుకోవ‌డం..ఈ ఉచ్చులో ప‌డిన వారిని నిండా ముంచి అందిన‌కాడి‌కి దోచుకుపోవ‌డం ఇప్పుడు న‌గ‌రంలో న‌డుస్తోన్న ట్రెండ్. గ‌త కొద్దిరోజులుగా మ‌ళ్లీ మ్యాట్రీమోని కేసులు ఒక్కోటిగా వెలుగులోకి వస్తోన్నాయి. మంచి ప్రొఫైల్ ఉన్న పెళ్లి కాని అమాయ‌క యువ‌కుల‌నే టార్గెట్ గా చేసుకుని.. కొంత మంది యువ‌తులు రెచ్చిపోతున్నారు.

  తాజాగా హైద‌రాబాద్ లో ఓ యువ‌తి మ్యాట్రీమోని వెబ్ సైట్ లో న‌కిలీ వివ‌రాలు పెట్టి ఒక యువ‌కుడిని నిలువుదోపిడీ చేసింది. అయితే యువ‌తి క‌ద‌లిక‌ల‌పై అనుమానం వ‌చ్చిన వ‌రుడి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కుస‌మాచారం అందించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

  న‌గ‌ర‌గానికి చెందిన బండి లావ‌ణ్య అనే యువ‌తి మ్యాట్రిమోనీ సైట్ లో న‌కిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి యువ‌కుల‌ను బుట్ట‌లో వేసుకోని అందిన కాడికి దోచుకుంటున్నది. ఇదే క్ర‌మంలో ఎల్బీన‌గ‌ర్ కు చెందిన అమ‌రేష్ అనే వ్య‌క్తి త‌న కుమారుడు ప్ర‌వీణ్ కుమార్ కు సంబంధాలు చూస్తుండగా.. మ్యాట్రీమోనీలో వివ‌రాలు పెట్టారు. అయితే వాళ్ల‌కు తాను ఒక చాన‌ల్ లో యాంక‌ర్ అని.. త‌న‌కు ఏపీలో నాలుగు రైస్ మిల్లులు ఉన్నాయ‌ని చెప్పి ఆ కుంటుంబానికి ప‌రిచ‌యం చేసుకుంది లావ‌ణ్య‌. త‌న త‌ల్లిదండ్ర‌లు, మామ‌య్య‌తో మాట్లాడ‌మ‌ని చెప్పి తానే వాళ్ల లా మాట్లాడుతూ కుటుంబాన్ని మోసం చేసింది. వ‌ర్క్ ఒత్తిడి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న నేరుగా వ‌చ్చిన క‌ల‌వ‌లేక‌పోతున్నాని త‌న‌కు కొంత షాపింగ్ చేయాల‌ని చెప్పి యువకుడితో త‌న‌కు న‌చ్చిన‌వి కొనిపించుకుంది. ఇదే విధంగా కొన్ని నెల‌లుగా చేస్తుండటంతో అనుమానం వ‌చ్చిన కుటుంబ స‌భ్య‌లు యువ‌తి వివ‌రాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేయడంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

  ఇదీ చదవండి.. నెల క్రితమే పెళ్లి... నగదు, నగలుతో ఉడాయించిన నవ వధువు.. ఆచూకీ లేని అత్తమామలు

  ఏపీలోనూ ఇలాంటి ఘటనే....

  ఇదిలా ఉంటే ఏపీలో ఇలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. తాను ముంబైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిన‌ని నెల‌కు రూ. 3 లక్ష‌ల రూపాయిలు జీతం అని చెప్పి యువ‌కుడిని మ్యాట్రిమోని సైట్ వేదిక‌గా మోసం చేసింది ఒక యువ‌తి. బాధిత యువ‌కుడి ప్యామీలి ద‌గ్గ‌ర నుంచి దాదాపు రూ. 15 లక్ష‌ల రూపాయిలు మొత్తం కాజేసింది. మ్యాట్రిమోని సైట్ లో ప‌రిచ‌యం అయిన త‌రువాత పెళ్లి చేసుకుందామ‌ని న‌మ్మించి పెళ్లైన త‌రువాత ఇద్ద‌రం ముంబైలోనే ఉందామ‌ని అక్క‌డ ఒక మంచి ఇళ్లు చూశాన‌ని దానికి అడ్వాన్స్ ఇవ్వాల‌ని యువ‌కుడికి మాయ మాట‌లు చెప్పి రూ. 15 ల‌క్ష‌లు కాజేసింది.

  ఈ సంఘ‌ట‌న‌ల‌తో అప్ర‌మ‌త్తం అవుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు. మ్యాట్రిమోని సైట్లో పెట్టే వివ‌రాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డ‌మే ఈ మోసాల‌కు కార‌ణం అని అంటున్నారు. దీంతోపాటు త‌ల్లిదండ్రులు, ముఖ్యంగా యువ‌కులు అప‌రిచిత వ్య‌క్తులతో ముందుగా ఎటువంటి నిర్ధార‌ణలు చేసుకోకుండా మ‌నీ లావాదేవీలు పెట్టుకోవడం మంచిది కాదంటున్నారు. మ్యాట్రీమోనీ సైట్లలో ఉంచే వివ‌రాల్లో దాదాపు 70 శాతం న‌కీలీగానే ఉంటాయ‌ని, ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకున్న త‌రువాతే ముందుకెళ్ల‌డం మంచిద‌ని హెచ్చరిస్తున్నారు సైబ‌ర్ క్రైమ్ నిపుణులు.
  Published by:Srinivas Munigala
  First published:

  అగ్ర కథనాలు