Love Story: ప్రేమికులు (lovers)తీరు ఒక్కోసారి చాలా వింత వింతగా కనిపిస్తుంది. ఓ సారి నవ్వులు పూయిస్తే.. మరోసారి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయినా ప్రంపచంతో సమకు సంబంధం లేదని.. నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ ఉంటారు లవర్స్. డీప్ లవ్ (deep love)లో ఉన్నవాళ్లైతే.. అసలు పక్కన ఏం జరుగుతోందో కూడా పట్టించుకోరు.. వారి బాధ వారిదే.. మాకెవరితో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తారు.. ప్రియుడి కోసం ప్రియురాలు.. ప్రియురాలి కోసం ప్రియుడు ఏం చేయడానికైనా సిద్ధమంటారు. అయితే వారిది ఎంత ఘాటు ప్రేమ అయినా మధ్య మధ్య చిన్న తగవులు.. అలకబూనడాలు కామన్ గా ఉంటాయి.. ఆ మాత్రం గొడవలు లేకపోతే ఎలా అంటుంటారు లవర్స్. అలా చిన్న గొడవలు అయ్యి.. మాటలు మానేసిన సందర్భాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఓ మెట్టుదిగి కాంప్రమైజ్ అవుతారు. బతిమాలో..బామాలో మళ్లీ లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఓ ప్రియురాలు .. తన ప్రియుడి కోసం చేసిన పని చూసి పోలీసులు అవాక్కయ్యారు.. ఇంతకీ ఏం జరిగిదంటే..?
బాయ్‌ఫ్రెండ్ (Boy Friend) తనతో మాట్లాడటం లేదని.. ఎలాగైనా అతనితో మాట్లాడించాలంటూ ఓ ప్రియురాలి.. నేరుగా 100 నెంబర్ కు డయల్ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.100 నంబర్‌కు ఫోన్ హాడావుడి చేయడంతో.. పోలీసులు (Police) ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం (Madhyapradesh state)లోని ఛింద్వారాలో చోటుచేసుకుంది. మొదట ఆమె తన లవర్ మాట్లాడడం లేదని చెప్పకుండా.. అత్యవసరం అన్నట్టు కాల్ చేసింది. తనకు అన్యాయం జరుగుతోందని.. వెంటనే ప్రియుడిని కలిసేలా చేయాలని కోరింది. దీంతో ఏ జరిగిందో అని పోలీసులు కంగారు పడ్డారు. చివరికి పూర్తి విషయం తెలుసుకొని అవాక్కయ్యారు..
మధ్యప్రదేశ్ లోని చింద్వారాకు చెందిన మహిళకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆ వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. అయితే ఆ పుట్టిన రోజుల వేడుకకు ప్రియురాలి వస్తుంది అని ఎంతో ఆశపెట్టుకున్నాడు. కానీ పుట్టిన రోజు నాడు.. ఆ మహిళ.. అతనికి విష్ చేయలేదు... దీంతో్ అమ్మాయితో ఆ యువకుడుల గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడాన్ని ఆపేశారు. ఆ తర్వాత మహిళ అతనితో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ.. ఆ వ్యక్తి మాట్లాడటం లేదు. దీంతో బెంగ పెట్టుకున్న ఆ మహిళ కొంతకాలంగా మదనపడుతోంది.
ఇదీ చదవండి: : సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ సెగలు.. అందాల ఆరబోతతో కవ్విస్తోన్న దేత్తడి హారిక
ఆమె మాట్లాడడానిక ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రియుడు మాత్రం మొహం చాటేశాడు. అమెకు కనిపించకుండా తప్పించుకుని తిరిగే వాడు. దీంతో ఆమె అతనితో ఎలాగైనా మాట్లాడాలని డిసైడ్ అయింది. పోలీసులు అయితే.. పరిష్కారం చూపుతారనుకొని.. ప్లాన్ వేసింది. దీంతో వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి.. లవర్ తనతో మాట్లాడటం లేదంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ మహిళ దగ్గరికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళకు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత.. ఇరు కుటుంబసభ్యుల ఒప్పందంతో ఆర్య సమాజ్‌లో ఇద్దరి పెళ్లి చేశారు. దీంతో శుభం కార్డు పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త.. మధ్యప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Lovers, Madya pradesh, National News