Young Woman: ఎంబీబీఎస్ చదువుతూ ఎంతపని చేశావమ్మా.. ఇంట్లో గోడపై చూడగా ఆ చేదు నిజం తెలిసింది..!

ఆత్మహత్యకు పాల్పడిన స్నేహ

గడ్చిరోలి పరిధిలోని ఘోట్ ప్రాంతానికి చెందిన స్నేహ భివాజి హిచామి(21) చంద్రాపూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. ఆమె తండ్రి పోలీసు అధికారి. తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా కరోనా తీవ్రతరం కావడం, వరుసగా లాక్‌డౌన్‌లు విధిస్తుండటంతో ఈ పరిణామాల పట్ల స్నేహ తీవ్రంగా మదనపడింది.

  • Share this:
    గడ్చిరోలి: డాక్టర్ అవ్వాలనుకున్న ఆ యువతి ఆశలను కరోనా మహమ్మారి చిదిమేసింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, వరుస లాక్‌డౌన్‌లు ఆమెను మానసిక ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఫలితంగా ఆమె ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గడ్చిరోలి పరిధిలోని ఘోట్ ప్రాంతానికి చెందిన స్నేహ భివాజి హిచామి(21) చంద్రాపూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. ఆమె తండ్రి పోలీసు అధికారి. తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా కరోనా తీవ్రతరం కావడం, వరుసగా లాక్‌డౌన్‌లు విధిస్తుండటంతో ఈ పరిణామాల పట్ల స్నేహ తీవ్రంగా మదనపడింది. అప్పటి నుంచి ఆమె దిగాలుగా ఉంటోంది. చిన్నచిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉండేది. ఇంట్లో ఎవరు తనతో మాట్లాడినా అసహనంతో సమాధానమిచ్చేది. ఇలా కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన స్నేహ క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. తన ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉంది. అద్దెకు ఉంటున్న వారు 8 రోజుల క్రితం ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ ఇంట్లోకి వెళ్లిన స్నేహ ఫ్యాన్ సీలింగ్‌కు నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే.. స్నేహ ఇంతలా మానసిక ఒత్తిడికి లోనవడానికి కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహ ఉరేసుకునే ముందు ఆ గదిలో ‘Depression’ అని ఇంగ్లీష్‌లో గోడపై రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

    కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ విధించడం, పరీక్షల షెడ్యూల్‌లో గందరగోళం కారణంగా డాక్టర్ అవ్వాలన్న తన కల నెరవేరదేమోనన్న బెంగతోనే స్నేహ ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డాక్టర్ అవుతుందని భావించిన కుమార్తె ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్నేహ అకాల మరణంతో ఆ ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
    Published by:Sambasiva Reddy
    First published: