హైదరాబాద్‌లో దారుణం.. టిక్‌టాక్‌‌‌లో దోస్తీ చేసి యువతిపై రేప్..

పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి టిక్‌టాక్‌లో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌ వాసి అక్బర్‌షా(34)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.

news18-telugu
Updated: May 18, 2020, 6:55 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. టిక్‌టాక్‌‌‌లో దోస్తీ చేసి యువతిపై రేప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియాలో పరిచయం వల్ల ఓ యువతి దారుణంగా మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన ఆ యువతి పలు మార్లు రేప్‌కు గురైంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి టిక్‌టాక్‌లో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌ వాసి అక్బర్‌షా(34)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన అమాయకురాలు.. తన సర్వస్వాన్ని అప్పగించేందుకు సిద్ధమైంది. ఓ రోజు ఇద్దరు కలిసి టోలీచౌకీలోని అక్బర్ షా సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక గానీ ఆ యువతికి తెలియరాలేదు.. తాను దారుణంగా మోసపోయానని. అక్కడే ఆమెను దారుణంగా రేప్ చేశాడు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పెళ్లి చేసుకుంటానని బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆచూకీ లేకుండా పోయాడు.

బాధితురాలు ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. అప్పటికే అక్బర్ షాకు పెళ్లైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 18, 2020, 6:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading