Sad: ఆ మాటను పేపర్‌పై 200 సార్లు రాసింది.. ఇప్పుడు ఈ యువతి మన మధ్య లేదు.. ఏం జరిగిందంటే...

వైశాలి (ఫైల్ ఫొటో)

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియ లేదు గానీ ఆమె చనిపోయే ముందు.. ఆమె పేరుతో పాటు మరో యువకుడి పేరు రాసి.. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా రాసింది.

  • Share this:
    మొరదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియ లేదు గానీ ఆమె చనిపోయే ముందు.. ఆమె పేరుతో పాటు మరో యువకుడి పేరు రాసి.. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా రాసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... వైశాలి చౌదరి అనే యువతి.. మొరదాబాద్‌లో ఉన్న తీర్థంకర్ మహవీర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ రోజూ యూనివర్సిటీకి వెళ్లి వస్తుండేది.

    ఏం జరిగిందో తెలియదు గానీ ఆ యువతి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఓ పేపర్ దొరికింది. ఆ పేపర్‌పై ‘Ashish Love Vaishali’ అని రాసి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు రెండు వందల సార్లు వైశాలి అలా ఆ పేపర్‌పై రాసింది.

    ఇది కూడా చదవండి: Married Daughter: షాకింగ్ ఘటన.. అల్లుడిని కాదనుకుని పుట్టింటికి వచ్చిన కూతురు అఫైర్ పెట్టుకుందని...

    ఆత్మహత్య చేసుకునే ముందుగా ఆమె ఇలా రాసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె రాసిన ఆ వాక్యంతో ఒక్క విషయం పోలీసులకు స్పష్టమైంది. ఆషిష్ అనే వ్యక్తిని వైశాలి ప్రేమిస్తోందని, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. ఆశిష్ కూడా వైశాలి చదువుతున్న యూనివర్సిటీలోనే ఎంబీబీఎస్ చదువుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆశిష్ వైశాలికి సీనియర్ కావడంతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్లిపోయాడు. అయితే.. అక్కడకు వెళ్లాక వైశాలికి ఇచ్చిన మాటను ఆశిష్ పట్టించుకోలేదు. ఈ విషయంలో ఆశిష్‌కు, వైశాలికి మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇదే విషయమై ఆశిష్‌ను కలిసేందుకు వైశాలి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ.. ఆశిష్ ఆమెను పూర్తిగా పక్కనపెట్టేశాడు.

    ఇది కూడా చదవండి: Married Woman: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. తన కోసం వెంపర్లాడుతున్న మావయ్య.. ఈ కోడలి నిర్ణయం ఇది..

    ఈ పరిణామంతో గత కొద్దిరోజులుగా వైశాలి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. మనస్తాపంతో కుంగిపోయింది. ఆత్మహత్యకు పాల్పడిన ముందు రోజు వైశాలి అసలు హాస్టల్‌కే వెళ్లలేదు. ఆ తర్వాత రోజు ఉదయం హాస్టల్‌కు వెళ్లిన వైశాలి తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉండగా.. పోలీసులు వైశాలి ఆత్మహత్య కేసులో సమర్థ్ జొహారి అనే మరో వ్యక్తిని కూడా అనుమానిస్తున్నారు. వైశాలికి, ఆశిష్‌కు ఇతను కామన్ ఫ్రెండ్ అని తెలిసింది. వైశాలి తండ్రి తన కూతురి ఆత్మహత్యకు ఆశిష్, సమర్థ్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించిన వ్యక్తి దూరం పెడుతున్నాడన్న మనస్తాపంతోనే వైశాలి ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఆమె ఆత్మహత్యకు మరేదైనా బలమైన కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు కేసు విచారణ సాగిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: