Home /News /crime /

YOUNG WOMAN DHARNA IN FRONT OF THE HOUSE OF HER HUSBAND WHO MARRIED AND CHEATED HER IN MAHBUBNAGAR DISTRICT SNR MNR

Love Cheater : ఆమె 8ఏళ్లుగా ప్రేమిస్తే .. అతను పెళ్లి చేసుకొని 5రోజులు కాపురం చేశాడు ..తర్వాత ఏం చేశాడంటే

(మొగుడే మోసగాడు)

(మొగుడే మోసగాడు)

Mahbubnagar: 8ఏళ్లుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కేవలం ఐదు రోజులు కాపురం చేశాడు. మూడు ముళ్ల బంధాన్ని మూడు నాళ్ల ముచ్చటగా మార్చుకొని ఆమెను నడిరోడ్డుపై పడేశాడు. మొగుడు చేతిలో మోసపోయిన యువతి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

ఇంకా చదవండి ...
  (Syed Rafi, News18,Mahabubnagar)
  ప్రేమించానని వెంటపడ్డాడు. నూరేళ్లు కలిసి ఉంటానని బాస చేశాడు. మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే ముఖం చాటేశాడు. మహబూబ్‌నగర్(Mahbubnagar)జిల్లాలో ఓ లవర్‌(Lover) రూపంలో పరిచయమైన లయర్(Liar) అని మొగుడు పేరుతో దగ్గరైన మోసగాడని ఆలస్యంగా తెలుసుంది నవవధువు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూ న్యాయం కోసం భర్త ఇంటి ముందే భైటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన మల్కాపురం సత్యనారాయణగౌడ్‌ ఊసరవెల్లిలా రంగులు మార్చుతాడని ఆ యువతి ఊహించలేకపోయింది. దేపల్లికి చెందిన పిట్టల రేణుక ముదిరాజ్ సత్యనారాయణగౌడ్‌ని గత 8సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. ఇద్దరిది ఒకే ఊరు. చిన్నప్పటినుండి కలిసి తిరిగిన వాళ్లు కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవింతాలని భావించారు. అందులో భాగంగానే సత్యనారాయణగౌడ్‌ జూన్‌ 17వ తేదిన హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో రేణుకా మెడలో మూడు ముళ్లు వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు.

  ప్రేమ పేరుతో వలవేశాడు..
  వేదమంత్రాల సాక్షిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సత్యనారాయణగౌడ్ అంతలోనే తన నిజస్వరూపాన్ని చూపించాడు. ప్రేమ పేరుతో తనను నమ్మి వచ్చిన యువతితో కేవలం ఐదు రోజుల పాటు కాపురం చేశాడు. మూడు ముళ్ల బంధాన్ని నూరేళ్ల పండుగలా రేణుకా భావించింది. కాని సత్యనారాయణ మాత్రం మూడు నాళ్ల ముచ్చటగా ఫీలయ్యాడు. తన మోజు తీర్చుకునేందుకు కేవలం పట్టుమని వారం రోజులు కూడా కాపురం చేయకుండానే రేణుకను వదిలి వెళ్లిపోయాడు.  మొగుడు కాసు మోసగాడు..
  కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు ఏకంగా తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదనే వంక చూపించి పారిపోయాడు సత్యనారాయణగౌడ్. తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని రేుణుకను నమ్మించి వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి సుమారు రెండు వారాల పాటు ఎదురుచూసింది. చివరకు అతను మోసం చేశాడని తెలుసుకొని నవాబుపేట పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. అక్కడ ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీకి కలిసింది బాధితురాలి సమస్యను పరిష్కరించమని ఎస్పీ నవాబ్‌పేట ఎస్‌ఐని ఆదేశించడంతో అతను కూడా న్యాయం చేయనంటూ తిప్పి పంపించారు.

  ఇది చదవండి : ఇంటికొచ్చిన యువకుడ్ని పట్టుకొని చావబాదారు..వివాహేతర సంబంధమే కారణమంటున్న గ్రామస్తులు  నడిరోడ్డున పడ్డ నవవధువు..
  ఓ యువకుడి చేతిలో మోసపోయిన యువతికి న్యాయం చేయమని కోరితే పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు రేణుక ఒంటరి పోరాటానికి దిగింది. భర్త సత్యనారాయణగౌడ్ ఇంటి ముందు భైటాయించి న్యాయం చేయమని కోరుతోంది. బాధితురాలు వచ్చిన విషయాన్ని గ్రహించిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ ఆడపిల్లకు న్యాయం చేయమంటే కనీసం పోలీసులు కూడా జాలి చూపడం లేదని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను ఆట వస్తువుగా చూస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సత్యనారాయణ గౌడ్ బంధువు అయిన విశ్వనాథ్ గౌడ్ ఇతని దాచిపెట్టాడని రేణుక ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో సత్యనారాయణ గౌడ్ ఉన్నాడని అతని భావ విశ్వనాథ్ గౌడ్ అతని కాపాడుతున్నాడని, తన నుండి వేరు చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని రేణుక ఆరోపించింది.

  ఇది చదవండి: కరీంనగర్ జిల్లాలో పూజారి హత్య .. ఆశ్రమంలో నీడనివ్వమని వచ్చిన వాళ్లిద్దరి పైనే అనుమానం


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Love cheating, Mahabubnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు