అతడు ఆమెను ప్రేమించాడు. కులాలు, మతాలు వేరైనా ఆమె ఒప్పుకుంది. పెద్దలను ఒప్పించిన ఆ యువతి ఎట్టకేలకు మనసుపడ్డవాడిని మనువాడింది. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు స్టోరీ. మతం మార్చుకోవాలని చిత్రహింసలు. అనుమానంతో వేధింపులు.. చివరకి తలాఖ్ చెప్పి వదిలించుకోవాలని ప్లాన్. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన దివ్యకు.., చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మక్కువ.. ఆ ఇష్టంతోనే మూడేళ్ల క్రితం తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీలోని సంగీత కళాశాలో చేరింది. అదే కళాశాలలో చదువుతున్న అహమ్మద్ తౌసీఫ్ అనే వ్యక్తి స్నేహితుల ద్వారా పరిచమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తొలుత అతడి ప్రేమను అంగీకరించని దివ్య.. ఆతర్వాత ఓకే చెప్పింది.
తన ప్రేమ విషయంలో ఇంట్లో చెప్పిన దివ్య.. వారిని ఎదురించి మరీ తౌఫిక్ ను పెళ్లి చేసుకుంది. ఇది తెలిసిన దివ్య కుటుంబసభ్యులు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తౌసీఫ్ దివ్య స్టేషన్ కి వెళ్లి మేము ఇష్టపూర్వకంగానే పెళ్లిచేసుకున్నట్లు చెప్పారు. దింతో పోలీసులు చేసేదే ఏమి లేక వారిని పంపించి కేసు కొట్టేశారు. అబ్బాయి తౌసీఫ్ తో పాటు అమ్మాయి దివ్య హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ వారం రోజులు ఉన్న తరువాత తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని తౌసీఫ్ అనంతపురం జిల్లా గుంతకల్ వెళ్లారు. కొద్దిరోజులు తరువాత దివ్యను కూడా గుంతకల్ తీసుకువెళ్లి ఇంట్లోనే ఉంచాడు.
మనోడు ఇంటికెళ్లగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అప్పటివరకు తనకు హిందువులు అంటే ఇష్టం దేవాలయాలకు వెళ్తాను... నీకోసం హిందూమంతం తీసుకున్నాను అని చెప్పి తారక్ గా పేరు మార్చుకున్న తౌసీఫ్. తీరా ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబసభ్యులతో కలసి దివ్యను ఇస్లాంలోకి మారాలంటూ వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. అది నచ్చని దివ్య వారికి ఎదురు చెప్పింది. దింతో తౌసీఫ్ అతని కుటుంబసభ్యులు రోజు కొట్టడం చిత్రహింసలు మొదలు పెట్టారు.
దివ్యను రెండు సార్లు గర్భవతిని చేసి అబార్సన్ కూడా చేయించాడు. ప్రేమించాడు.. పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకుండాడు అనుకుంటే.. శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. తనను అన్ని విధాలా మోసగించి.. తన జీవితాన్ని నాశనం చేసిన నిందితుడు తౌసీఫ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దివ్యకు అండగా హిందూ సంఘాల నేతలు, సినీ నటి కరాటీ కళ్యాణి గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీస్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. భదితరాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Love affiar, Love marriage