హోమ్ /వార్తలు /క్రైమ్ /

విషాదం.. అమ్మా.. నేను మిమ్మల్ని వదిలిపోతున్నా.. క్షమించండి..

విషాదం.. అమ్మా.. నేను మిమ్మల్ని వదిలిపోతున్నా.. క్షమించండి..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

ఉమ కుటుంబ సభ్యులు నీ ఇష్టం బిడ్డా.. నువ్వు ఎవరినీ చేసుకున్నా.. సంతోషంగా ఉంటే మాకు అదే చాలంటూ.. రంజిత్‌తో పెళ్లికి అంగీకరించారు.

‘అమ్మా.. నేను మిమ్మల్ని వదిలిపోతున్నా.. నన్ను క్షమించండి. నేను ప్రాణంగా ప్రేమించిన వాడే.. నన్ను హ్యాపీగా ఉండనియ్యట్లేదమ్మా. ప్రేమించినందుకు నన్నే చేసుకోవాలి.. లేకపోతే ప్రాణం తీసుకోవాలంటున్నాడు. వాడ్ని పెళ్లి చేసుకుని బంగారం లాంటి మీకు చెడ్డపేరు తీసుకురానమ్మా. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా. నాకు పెళ్లయినా వాడు హ్యాపీగా ఉండనీయడు. ఆ బాధ నేను పడి.. మిమ్మల్నీపడినివ్వలేను. అందుకే నేను మిమ్మల్ని వదిలిపోతున్నా.. మిస్ యూ అమ్మా నాన్న అంటూ ఓ యువతి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైట్ నోట్ ఇది. చదువుతుంటే.. మనకు అయ్యో పాపం అన్పిస్తుంది. అలాంటిది ఆ యువతి ఇంకెంత నరకం అనుభవించిందో. అందుకే ఈ నిర్ణయం తీసుకుందేమో అన్పించకమానదు. ఏదీఏమైనా అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నవారికి మనం ఏం ఇవ్వకపోయినా ఫర్వాలేదు.

కానీ ఇలాంటి తీరని శోకాన్ని మిగల్చడం బాధకరం. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి, సత్తయ్యలకు నలుగురు కూతుళ్లు. ఇప్పటికే ముగ్గురు కూతుళ్లకు వివాహం చేశాడు. నాలుగో కూతురు ఉమ(19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్‌తో ప్రేమలో పడింది. ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఉమకు ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకేందుకు సంబంధాలు చూస్తున్నారు. దీంతో ఉమ.. తాను రంజిత్‌ను ప్రేమించానని అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఉమ కుటుంబ సభ్యులు నీ ఇష్టం బిడ్డా.. నువ్వు ఎవరినీ చేసుకున్నా.. సంతోషంగా ఉంటే మాకు అదే చాలంటూ.. రంజిత్‌తో పెళ్లికి అంగీకరించారు.

దీంతో ఉమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఉమతో పాటు కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాలుగా పెళ్లి చేసుకోవాలంటూ అడిగితే.. దాటవేస్తూ వస్తున్నాడు. పైగా ఉమ కుటుంబ సభ్యులు చూస్తున్నఇతర సంబంధాలను చెడగొడుతూ వస్తున్నాడు. ఉమ పెళ్లి చేసుకుంటే.. నన్నే చేసుకోవాలి.. లేకుంటే చచ్చిపోవాలంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఉమ ఈనెల 20న రాత్రి సమయంలో ఇంటి వెనుక ఉన్న గుడిసెలో పురుగుల మందు తాగింది.

అనంతరం ఇంట్లోకి వచ్చి వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం చనిపోయింది. ఈ క్రమంలో ఇంటిలో ఉమ రాసిన సూసైడ్ నోట్ అక్కలకు దొరికింది. ప్రేమించి మోసగించిన రంజిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Karimangar, Telangana

ఉత్తమ కథలు