నల్లగొండ జిల్లాలో ఓ ప్రేమికుడు తనలోని వరకట్న దాహాన్ని పెళ్లికి ముందే బయటపెట్టడాన్ని పెళ్లి కూతురు భరించలేకపోయింది. చచ్చేదాక తోడుంటానని మాటిచ్చిన ప్రియుడు మూడు ముళ్లు పడకముందే ప్రేమించిన అమ్మాయి కంటే డబ్బే ముఖ్యమని చెప్పడాన్ని తట్టుకోలేకపోయింది. పెళ్లి తర్వాత ఇవ్వాల్సిన కట్న, కానుకల పంచాయితీని నిశ్చితార్ధం అవగానే తెరపైకి తెచ్చి అమ్మాయిని టార్చర్Torture పెట్టడంతో బ్రతకడం వేస్ట్ అనుకుంది. పెళ్లి చేసుకోబోయే వాడు అవమానించాడని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లాలో చోటుచేసుకుంది. అనుముల మండలం పంగవానికుంట గ్రామానికి చెందిన మేగావత్ నవత అనే 22సంవత్సరాల యువతి ఫ్యాన్‌కి ఉరివేసుకొని బలవన్మరణానికి(Suicide) పాల్పడింది. మెగావత్ నవత (Megawatt Navatha)కొద్ది రోజుల నుంచి త్రిపురారం మండంలోని లక్పతి తండాకు చెందిన ధనావత్ జగపతిబాబు(Dhanavat Jagapathibabu)ను ప్రేమించింది. ఇద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. నవత తండ్రి వెంకటేశ్వర్లు(Venkateshwarlu)పెళ్లి పేరుతో అల్లుడికి 80వేల నగదు, 20లక్షల విలువ చేసే ప్లాట్(Plot)ని కట్నంగా ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరికి నిశ్చితార్ధం(Engagement)కూడా జరిపించారు.
ప్రియుడు కాదు వరకట్న పిశాచి..
నవతతో నిశ్చితార్ధం జరిగిన మరుసటి రోజు నుంచి జగపతిబాబు కట్నం కింద ఇస్తామన్న ఫ్లాట్‌ని విక్రయించి తనకు 20లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈవిషయాన్ని నవత తల్లిదండ్రులతో చర్చించకుండా ప్రేమించిన యువతి, కాబోయే భార్యను టార్చర్ పెడుతూ వచ్చాడు. పెళ్లి చేసుకోబోయే భర్త పెట్టే టార్చర్ మరింత ఎక్కువైంది. ఆదివారం రాత్రి నవతకు ఫోన్ చేసి తిట్టాడు. అనంతరం డబ్బులు ఇవ్వలేకపోతే ఎందుకు నువ్వు చావు అంటూ మెసేజ్ పెట్టాడు. జగపతిబాబు కట్నం కోసం తనను వేధించడాన్ని భరించలేకపోయిన నవత తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ప్రియుడి టార్చర్ భరించలేక..
తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి కుదుర్చుకునే సమయంలో కట్న, కానుకల దగ్గర పేచీ పెడతారు. లేదంటే పెళ్లి సమయంలో ఇంకా కట్నం సరిపోలేదని డిమాండ్ చేస్తారు. చివరకు వివాహం జరిగిన తర్వాత అదనపు కట్నం కావాలని పట్టుబడతారు. కాని పెళ్లి జరగక ముందే, ప్రేమించిన యువతిని కట్నం కోసం వేధిందిచిన ప్రియుడు జగపతిబాబును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నవత ఫోన్ కాల్ డేటా, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. పూర్తి విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lover cheating, Nalgonda