Home /News /crime /

YOUNG WOMAN COMMIT SUICIDE AFTER SHE KNOW ABOUT GROOM NEW DEMAND FOR MARRIAGE IN PRAKASAM DISTRICT HSN

పెళ్లిచూపుల్లో రూ.2.5 లక్షల కట్నానికి ఓకేనన్న కుర్రాడు.. తాజాగా రూ.7లక్షలిస్తేనే పెళ్లాడతానంటున్నాడని ఆ యువతికి తెలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యువతికి కూడా అతడు నచ్చాడు. పెళ్లి ఖాయం చేసుకున్నారు. కట్నం కూడా మాట్లాడుకున్నారు. అన్నీ ఓకే అనుకున్న కొద్ది రోజుల తర్వాత ముహూర్తాలు పెట్టుకునేందుకు ఆ కుర్రాడి ఇంటికి వెళ్లారు. ఏమయిందో ఏమో కానీ, ఆ కుర్రాడు మాత్రం మాట మార్చాడు.

  ఓ కుర్రాడి ధనదాహం ఓ యువతి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి కట్నం మోజు వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయి నచ్చిందన్నాడు. ఆ యువతికి కూడా అతడు నచ్చాడు. పెళ్లి ఖాయం చేసుకున్నారు. కట్నం కూడా ముందుగానే మాట్లాడుకున్నారు. అన్నీ ఓకే అనుకున్న కొద్ది రోజుల తర్వాత ముహూర్తాలు పెట్టుకునేందుకు ఆ కుర్రాడి ఇంటికి వెళ్లారు. ఏమయిందో ఏమో కానీ, ఆ కుర్రాడు మాత్రం మాట మార్చాడు. ముందుగా ఒప్పుకున్న కట్నం కంటే అధికంగా కావాలని పట్టుబట్టాడు. అంత డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. అతడిని ఒప్పించేందుకు పెళ్లికూతురి తరపు వాళ్లు చాలా ప్రయాస పడ్డారు. కానీ అతడు ససేమిరా అన్నాడు. ఈ విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురయింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మిట్టమీదిపల్లి గ్రామానికి చెందిన గిద్దలూరు నారాయణ అనే యువకుడు అదే గ్రామంలో వలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో కంభం మండలం హెచ్ గూడెంకు చెందిన గంగనగుంట్ల వెంకటేశ్వర్లు కుమార్తె శ్రీలత ఇంటికి అతడు పెళ్లిచూపులకు వచ్చాడు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అనంతరం కట్న కానుకల గురించి మాట్లాడుకున్నారు. 2.50 లక్షల కట్నానికి పెళ్లి చేసుకునేందుకు నారాయణ ఒప్పుకున్నాడు. దీంతో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేందుకు అమ్మాయి తండ్రి వెంకటేశ్వర్లు, తన బంధువులతో కలిసి బుధవారం ఉదయం మిట్టమీదిపల్లికి వెళ్లాడు. నారాయణ ఇంటికి వెళ్లారు.
  ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

  అయితే కారణం ఏమిటో ఏమో కానీ నారాయణ మాత్రం మాట మార్చేశాడు. తాను ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ముందుగా ఒప్పుకున్న 2.50 లక్షల కట్నం కాకుండా 7 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టుపట్టాడు. ఇది కాస్తా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. తీవ్ర రసాభాసగా మారింది. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నారాయణను ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ అతడు మాత్రం ఏమాత్రం అంగీకారం తెలపలేదు. అయితే ఈ విషయం కాస్తా ఫోన్ ద్వారా శ్రీలతకు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురయింది.
  ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

  ఫలానా వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయిందని ఊరంతా తెలిసిందనీ, ఇప్పుడు పెళ్లి రద్దయితే పరువు పోయి, తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందని శ్రీలత మనస్తాపానికి గురయింది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి కుప్పకూలిపోయారు. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా ఆత్మహత్యకు పాల్పడటాన్ని తట్టుకోలేకపోయారు. నారాయణ వ్యవహారం వల్లే కలత చెంది ఈ దారుణానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు