మాజీ ప్రియుడి గర్ల్ ఫ్రెండ్ వేధింపులు... తట్టుకోలేక యువతి ఆత్మహత్య

వేరే అమ్మాయితో అతడు చాట్ చేయడం చూసిన అంజలి నిలదీసింది. ఇద్దరు మధ్య గొడవలు రావడంతో... తాను మోసపోయిందని బాధపడుతూ... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.

news18-telugu
Updated: May 4, 2019, 12:28 PM IST
మాజీ ప్రియుడి గర్ల్ ఫ్రెండ్ వేధింపులు... తట్టుకోలేక యువతి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతడు తన జీవితం అనుకుంది. కానీ ప్రియుడు తనను మోసం చేసి వేరే యువతికి దగ్గరవ్వడం భరించలేకపోయింది. దూరంగా ఉండాలని ఉన్న ఊరిని .. కన్నవారిని వదిలి అయినవాళ్ల దగ్గర వచ్చి తలదాచుకుంది. అయినా కూడా ఆమెను వేధింపులు వదల్లేదు. ప్రేమించిన అబ్బాయి తాజా ప్రియురాలు తనకు ఫోన్లు చేసి టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. మెసేజ్‌లు ఫోన్లు చేసి బాధించడం ప్రారంభించింది. దీంతో ఆ బాధను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది పాపం యువతి. వివరాల్లోకి వెళ్తే వైజాగ్‌కు చెందిన అంజలి... స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే పనిచేస్తున్న జాజిబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఈ క్రమంలో జాజిబాబుకు వసుంధర అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వేరే అమ్మాయితో అతడు చాట్ చేయడం చూసిన అంజలి నిలదీసింది. ఇద్దరు మధ్య గొడవలు రావడంతో... తాను మోసపోయిందని బాధపడుతూ... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.

అంజలి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు ఇరుకుటుంబాల మధ్య పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత అంజలిని గతనెల హైదరాబాద్‌ అల్విన్ కాలనీలో ఉంటున్న మరో కుమార్తె ఇంటికి పంపించేశారు. అయితే అక్క ఇంట్లో ఉంటున్న అంజలికి ఫోన్ చేసి జాజిబాబు తాజా గర్ల్ ఫ్రెండ్ వేధించడం మొదలుపెట్టింది. కాల్స్ చేసి, మెసేజ్‌లు పెట్టి నిత్యం వేధిస్తూ ఉండేది. దీంతో వసుంధర వేధింపులు తట్టుకోలేక... ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది అంజలి. తన చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని కఠినంగా శిక్షించాలని సెల్పీ వీడియో కూడా తీసుకుంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

First published: May 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>