కులం కాని వాడిని ప్రేమించిందని.... యువతిని అర్థనగ్నంగా చేసి....

యువతిని అర్థనగ్నంగా చేసి కొడుతున్న కుటుంబసభ్యులు

19 ఏళ్ల యువతి మరో తెగకు చెందిన యువకుడిని ప్రేమించింది. తమ వివాహానికి ఇరుకుటుంబాలు ఒప్పుకోవని భావించిన ప్రేమికులు, ఇంట్లో నుంచి పారిపోయారు.

  • Share this:
    వారిద్దరు కులాలు వేరు. తెగలు వేరు. అయినా కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇష్టపడ్డారు. కలిసి బతకాలనుకున్నారు. ఈ సమాజం, కులం, పెద్దలు తమను కలిసి ఉండలేరని భావించారు.అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి హాయిగా బతకాలన్నారు. అనుకున్న ప్రకారం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి పరారయ్యారు. కానీ తమ తల తీసినంత పని  చేసిందని అమ్మాయి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోయింది. పారిపోయిన కూతుర్ని వెతికి ఇంటికి తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా అమ్మాయిని చితకబాదారు. అర్థనగ్నంగా ఊరంతా పరిగెత్తించి మరీ కొట్టారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

    తమాచీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి మరో తెగకు చెందిన యువకుడిని ప్రేమించింది. తమ వివాహానికి ఇరుకుటుంబాలు ఒప్పుకోవని భావించిన ప్రేమికులు, ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో కూతురు చేసిన పనితో తమ పరువు పోయిందని భావించారు అమ్మాయి తల్లిదండ్రులు. కూతుర్ని వెతికి ఇంటికి పట్టుకొచ్చి చావాబాదారు. అనంతరం అర్థనగ్నంగా చేసి ఇంట్లోని వాళ్లంతా ఆమెను చావబాదారు. అంతటితో ఆగకుండా కర్రతో కొడుతూ ఊరిలోని రోడ్ల వెంట తిప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులు గ్రామం విడిచి వెళ్లిపోయారని... అందుకే వారి స్టేట్‌మెంట్ తీసుకోలేకపోయామని తెలిపారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: