హోమ్ /వార్తలు /క్రైమ్ /

పారిపోయిన ప్రేమికుల పీకలు కోసి అతి దారుణంగా... పాక్‌లో పరువు హత్య...

పారిపోయిన ప్రేమికుల పీకలు కోసి అతి దారుణంగా... పాక్‌లో పరువు హత్య...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరాచీ నగరంలో ప్రేమికుల దారుణ హత్య... ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న యువజంట... పీకలు కోసి చంపిన దుండగులు...

మిర్యాలగూడలో ప్రణయ్, అమృతల పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుందనే కసితో... కన్న కూతురిపై దాడి చేసి చంపబోయాడో తండ్రి హైదరాబాద్ నగరంలో... ఇలాంటి పరువు హత్యలు మనదేశంలోనే కాదు... మన పక్కదేశమైన పాక్‌లోనూ జరుగుతాయి. నిజానికి పాకిస్తాన్‌లో జరిగే పరువు హత్యలతో పోలిస్తే... భారత్‌లో జరిగేవి చాలా తక్కువే. పాక్‌లోని కరాచీ నగరంలో మరో ‘పరువు హత్య’ సంచలనం క్రియేట్ చేసింది. కరాచీలో ఉన్న 25 ఏళ్ల నశీబ్ ఖాన్, 20 ఏళ్ల బీబీ దక్తర్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పాక్‌లోని పాస్తన్ తెగకు చెందినవారు. ఇరు కుటుంబాల మధ్య చాలాఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.


ఇంట్లో చెబితే పెద్దవాళ్లు ఒప్పుకోరనే ఉద్దేశంతో ఏడాది క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. పెళ్లిచేసుకుని, విడిగా కాపురం ఉంటున్న వీరు... శనివారం అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. ఇద్దరిపై దాడి చేసిన దుండగులు... అత్యంత క్రూరంగా పీకలు కోసి చంపేశారు. అయితే ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలియకపోయినా... వీరి పెళ్లిచేసుకోవడం తెలుసుకున్న కుటుంబసభ్యులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది పాక్ దేశవ్యాప్తంగా ఏకంగా వెయ్యికి పైగా మహిళలు... దారుణ హత్యకు గురి కావడం విశేషం. ఇవన్నీ కూడా బంధువులు, కుటుంబసభ్యుల చేతిలో ‘పరువు హత్యలే’ కావడం గమనార్హం. ముస్లిం మెజారిటీ దేశంలో ఈ స్థాయిలో హత్య జరగడం విశేషం.

First published:

Tags: Crime, Honor Killing, Pakistan

ఉత్తమ కథలు