స్నానం చేస్తుండగా వీడియో తీసి.. భర్తను చంపేస్తానంటూ బెదిరించి అఘాయిత్యం

ఏడాది క్రితం ఆమె స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోలను చూపి ఆ వివాహితను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. సదరు వివాహిత ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలిందచి వదిలిపెట్టారు.

news18-telugu
Updated: May 24, 2020, 3:31 PM IST
స్నానం చేస్తుండగా వీడియో తీసి.. భర్తను చంపేస్తానంటూ బెదిరించి అఘాయిత్యం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఓ యువకుడు మరో వ్యక్తి భార్యపై కన్నేశాడు. ఏలాగైనా ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. భర్తను చంపేస్తానంటూ బెదిరించి లోబర్చుకున్నాడు. ఆపై వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపి బెదిరిస్తూ లైంగిక దాడిని కొనసాగిస్తున్నాడు. రోజురోజూకీ లైంగిక వేధింపులు ఎక్కువవుతుండడంతో ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఇద్దరు దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఆ వివాహిత(43)పై అదే ప్రాంతానికి చెందిన బానోతు మధు(21) కన్నేశాడు. ఏలాగైనా ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఆమె స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోలను చూపి ఆ వివాహితను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు.

సదరు వివాహిత ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలిందచి వదిలిపెట్టారు. దీంతో కొద్ది రోజుల పాటు ఆ వివాహిత జోలికి వెళ్లలేదు. కానీ నెల రోజులుగా భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నాడు. శారీరక సంబంధానికి అంగీకరించకపోతే నీ భర్తను చంపేస్తానంటూ బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తూ రోజూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. రోజురోజూకీ వేధింపులు ఎక్కువ కావడంతో వివాహిత జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది.

దీంతో వారు పాల్వంచ పట్టణ పోలీసులను సంప్రదించాడు. ఈ విషయం తెలుసుకున్న బానోతు మధు, అతడి తల్లిదండ్రులు ఆ వివాహిత ఇంటికి వెళ్లి అసభ్యకరంగా తిట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 24, 2020, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading