డబ్బు మోజులో సిన్సియర్ లవర్‌కు హ్యాండిచ్చి...వేరే కుర్రాడితో గర్భవతి అయ్యి...ఇఫ్పుడు మాజీ ప్రియుడే కారణమంటూ...

తనకు అమెరికాలో జాబ్ వచ్చిందని, పెళ్లి చేసుకుంటానని, అక్కడే సెటిల్ అవుదామని నమ్మించాడు. అర్చన రాకేష్ కు దగ్గరైంది. అంతేకాదు శారీరక బంధం పెట్టుకుంది. రెండు నెలల పాటు ఈ బంధం కొనసాగింది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. ఈ లోగా రాకేష్ నెమ్మదిగా అమెరికాకు జారుకున్నాడు.

news18-telugu
Updated: November 5, 2020, 1:23 AM IST
డబ్బు మోజులో సిన్సియర్ లవర్‌కు హ్యాండిచ్చి...వేరే కుర్రాడితో గర్భవతి అయ్యి...ఇఫ్పుడు మాజీ ప్రియుడే కారణమంటూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువతి తన ప్రియుడిని మోసం చేయడమే కాదు...తన స్వార్థం కోసం అతడి ప్రాణాలను సైతం బలికొనే స్థాయికి దిగజారింది. అతడితో ప్రేమ పాఠాలు వల్లిస్తూనే, మరో యువకుడితో శృంగార లీలలు చేసి గర్భం దాల్చింది. చివరకు అతడు అడ్రస్ కనిపించకుండా పోయే సరికి మాజీ ప్రియుడే తనకు గర్భం చేశాడంటూ దొంగ ఏడుపులు ఏడ్చింది. దీంతో ఆ మాజీ ప్రియుడు అడ్డంగా బుక్ అయ్యాడు ఆ ఘటన కర్నాటక లోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.దినేష్, అర్చన( పేరు మార్చాం) ఇద్దరూ క్లాస్‌మేట్స్. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో పాటు దినేష్ అర్చనను ప్రేమించాడు. ఆ విషయాన్ని అర్చనకు చెప్పాడు. అందుకు అర్చన కూడా సరే అన్నది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నప్పుడే వారి మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. అతడే రాకేష్ తరచూ అర్చన ఇంటికి వచ్చి పోయేవాడు. అతడి కళ్ళు అర్చనపై పడ్డాయి. మెల్లగా అర్చనను మాటల్లోకి దింపాడు. తనకు అమెరికాలో జాబ్ వచ్చిందని, పెళ్లి చేసుకుంటానని, అక్కడే సెటిల్ అవుదామని నమ్మించాడు. అర్చన రాకేష్ కు దగ్గరైంది. అంతేకాదు శారీరక బంధం పెట్టుకుంది. రెండు నెలల పాటు ఈ బంధం కొనసాగింది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. ఈ లోగా రాకేష్ నెమ్మదిగా అమెరికాకు జారుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అర్చన గర్భవతి అనే విషయం ఇంట్లో తెలిసిపోయింది.

దీంతో కుటుంబ సభ్యులు నిలదీయగా, ఆమె తన మాజీ ప్రియుడు దినేష్ కారణమని చెప్పింది.అర్చన కుటుంబ సభ్యులంతా కలిసి ఆవేశంతో దినేష్ ను చితకబాదారు. ఐతే ఆమె గర్భానికి తనకేమీ సంబంధం లేదని దినేష్ చెప్పాడు. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎంత మాత్రం నమ్మలేదు. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దినేష్ ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అతడి ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టిన కుటుంబ సభ్యులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే తన ఆవేదనంతా ఫేస్ బుక్ ద్వారా ఆ యువకుడు చెప్పుకొచ్చాడు.
Published by: Krishna Adithya
First published: November 5, 2020, 1:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading