కొందరిలో ఆవేశం ఉన్మాదానికి ప్రేరేపిస్తోంది. పరువు కోసం ఓ యువకుడు నరరూప రాక్షసుడి అవతారమెత్తాడు. కేవలం తన చెల్లెల్ని ప్రేమించాడనే విషయాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తిని చంపి అతని శవాన్ని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. బీహార్‌లో జరిగిన ఈ పరువు హత్య ఇప్పుడు వైరల్ అవుతోంది. ఢిల్లీ(Delhi)లో శ్రద్దా వాకర్ (Shraddha Walker)అనే యువతిని ప్రేమించిన వాడే చంపి ముక్కలు చేసిన సంఘటన మర్చిపోక ముందే బీహార్(Bihar)లో తన సోదరిని ప్రేమించిన యువకుడ్ని నరికి చంపి ..ముక్కల్ని కుక్కల(Dogs)కు వేశాడో యువకుడు. నలంద జిల్లా(Nalanda)లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత పోలీసు(Police)లే షాక్ అవుతున్నారు.
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం..
సాటి మనిషి ప్రాణం తీయడం చాలా సులువైపోయింది. ఎదుటి వ్యక్తితో విభేదాలు వచ్చినా..ప్రవర్తన నచ్చకపోయినా క్షణికావేశంలో రక్తం కళ్ల చూస్తున్నారు. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో రాహుల్ అనే యువకుడు అలాంటి దారుణానికే పాల్పడ్డాడు. బిట్టు కుమార్ అనే ఓ యువకుడ్ని రాహుల్ నరికి చంపాడు. అటుపై బిట్టు కుమార్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు. శరీరంలోని పెద్ద భాగాలను దగ్గరలోని నదిలో పడేసి చేతులు దులుపుకున్నాడు.
చంపి ముక్కల్ని కుక్కలకు వేశాడు..
బిట్టుకుమార్ రాహుల్ సోదరిని ప్రేమించాడు. ఇద్దరూ క్లోజ్‌గా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన రాహుల్ ఎలాగైనా తన సోదరిని ప్రేమించిన వాడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే డిసెంబర్ 16వ తేదిన ఇంటి నుంచి బయటకు వచ్చిన బిట్టుకుమార్‌ని మాట్లాడాలని రమ్మని చెప్పి నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే బిట్టుకుమార్‌ని దారుణంగా నరికి చంపాడు. అటుపై మృతదేహం ముక్కల్ని కుక్కలకు వేశాడు. బిట్టు కుమార్ ఈనెల 18వ తేది వరకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగానే రాహుల్‌ని అనుమానించారు.
పరువు హత్యగా నిర్దారణ..
బిట్టుకుమార్ మర్డర్ వెనుక ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చన్న అనుమానంతో రాహుల్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టడంతో తానే బిట్టుకుమార్‌ని హతమార్చినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. రాహుల్‌పై మర్డర్ కేసు నమోదు చేశారు. నదిలో పడేసిన బిట్టుకుమార్ మృతదేహం శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.
హత్యకు సహాయం చేసిందెవరూ..
నలంద జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసు పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కేవలం తమ కంటే కిందిస్థాయి వ్యక్తి తన సోదరిని ప్రేమించాడనే కోపంతోనే రాహుల్ ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా తేల్చారు. అయితే హత్య కేసులో రాహుల్ ఒక్కడే నిందితుడు ఉన్నాడా లేక ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Love affiar, VIRAL NEWS