అమ్మాయిలను ప్రేమించమని వెంటపడే వాళ్లను చూశాం. లేదంటే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే వాళ్ల గురించి విన్నాం. బిహార్‌లో ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో అమ్మాయి ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని టార్చర్ పెట్టాడు. తలుపులు బాదుతూ ఇంట్లోకి చొరబడి అందర్ని నిద్రలేపి వీరంగం సృష్టించాడు. ఇంట్లో ఉన్న యువతి కుటుంబ సభ్యులు అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బెదిరించడం, బ్లాక్ మెయిల్(Blackmail)చేస్తూ వాళ్లపైనే దాడికి దిగాడు. అర్ధరాత్రి ఓ పోకిరి వచ్చి నానా యాగీ చేస్తుండగా యువతి కుటుంబ సభ్యులు వీడియో(Video) తీసి పోలీస్ కంప్లైంట్(Police Complaint) ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.
కోరిక తీర్చమని పోకిరి వేధింపులు..
బిహార్‌లోని సీతామర్హి ప్రాంతానికి చెందిన ఓ యువతి కుటుంబ సభ్యులను ఓ యువకుడు అర్ధరాత్రి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. సీతామర్హి ప్రాంతంలో నివసిస్తున్న యువతి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఓ యువకుడు అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాడు. అంతకు ముందు ఆమె సెల్‌ఫోన్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టాడు. రెండ్రోజుల క్రితం ఏకంగా యువతి ఇంట్లోకి చొరబడి తన కోరిక తీర్చమంటూ ...తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లి గొడవ..
అర్ధరాత్రి ఇంటికి వచ్చి వీరంగం సృష్టించాడు ఓ యువకుడు. యువతిపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి లక్ష్మీనగర్‌కు చెందిన వాడిగా బాధితులు గుర్తించారు.అతను తలుపులు తెరవమని గొడవ చేస్తుంటే కొద్ది సేపు భరించారు. తలుపులు తీసేందుకు నిరాకరించారు. దాంతో యువకుడు మరింత రెచ్చిపోయి ఇంట్లో ఉన్న యువతితో పాటు ఆమె అక్క, చెల్లెళ్లను అసభ్యపదజాలం ఉపయోగిస్తూ దూషించాడు. కిటికీలోంచి యువతి తండ్రి ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా బెదిరించాడు. యువతిని తనతో పంపమని...లేకపోతే మీ అందరి అంతూ చూస్తానంటూ బెదిరించాడు. మీరు పోలీసులు, ఎస్పీకి చెప్పుకున్నా నాకేం భయం లేదంటూ సుమారు గంటకుపైగా రభస చేశాడు. చివరకు ఇంట్లోకి చొరబడి యువతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
వైరల్ అవుతున్న వీడియో..
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి నానా యాగీ చేయడంతో అందరూ మేల్కొని అతడ్ని యువతిని పట్టుకోకుండా అడ్డుకున్నారు. అతడ్ని బలవంతంగా ఇంటి నుంచి బయటకు నెట్టివేశారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యువకుడి పేరు మోను సింగ్ అని గుర్తించారు. అతను బాధితురాలి ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల గురించి అసభ్యకరమైన విషయాలను రాస్తూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నాడని బాధితురాలు తెలపడంతో మోను సింగ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితుడు గతంలో ఆయుధ చట్టం కింద జైలు శిక్ష అనుభవించిన పాతనేరస్తుడిగా గుర్తించారు. ఒక నేరస్తుడు పబ్లిక్‌గా ఇంట్లోకి చొరబడి అమ్మాయిలను శారీరకంగా కోరిక తీర్చమని బ్లాక్ మెయిల్ చేస్తుంటే బిహార్‌లో పోలీసులు ఏం చేస్తున్నారనే విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Crime news, Viral Video