హోమ్ /వార్తలు /క్రైమ్ /

Chennai: కుటుంబ సభ్యులముందే యువతి కిడ్నాప్.. దీని వెనుక పెద్ద కథే ఉంది..! వీడియో వైరల్..!

Chennai: కుటుంబ సభ్యులముందే యువతి కిడ్నాప్.. దీని వెనుక పెద్ద కథే ఉంది..! వీడియో వైరల్..!

యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్న విఘ్నేశ్వరన్

యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్న విఘ్నేశ్వరన్

ఓ యువతీ పట్ల కొందరు యువకులు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల ముందే యువతిని కిడ్నాప్ చేసిన ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఇంట్లో ఉన్నా మహిళలకి రక్షణ ఉండదా అనే భావన వ్యక్తం అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

GT Hemanth Kumar, News18, Tirupatiమహిళలను ఆటవస్తువులు భావించి కొందరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తమ దారికి తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు మరెన్నో బెదిరింపులకు దిగుతుంటారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్ళు పట్టుకొని లాగేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. మాట వింటే ఒకే.. మాట వినకుంటే దాడులు..! మరింత రెచ్చిపోయి హత్యలు చేస్తున్న ఘటనలు సమాజంలో తరచూ చూస్తున్నాం. ఓ యువతీ పట్ల కొందరు యువకులు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల ముందే యువతిని కిడ్నాప్ చేసిన ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఇంట్లో ఉన్నా మహిళలకి రక్షణ ఉండదా అనే భావన వ్యక్తం అవుతోంది. వివరాల్లోకి వెళితే.., తమిళనాడు (Tamil Nadu) లోని మైలడుతురై లోని నివాసితున్న విఘేశ్వరన్ అనే యువకునికి అదే ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి చూపులు జరిగాయి.

ఇరు కుటుంబాలు.. జంట పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షించారు. అంతా ప్రశాంతంగా సాగుతున్న తరుణంలో విఘేశ్వరన్ యువతీ కుటుంబానికి కొంత నగదును సైతం ఇచ్చాడు. నిశ్చయం అయినా కొన్నాళ్ల అనంతరం... విఘేశ్వరన్ ను వద్దని భావించింది ఆ యువతి. వ్యక్తిగత కారణాలవల్ల విఘ్నేష్ అంటే ఇష్టం లేదని ఆమె చెప్పడంతో అమ్మాయి ఇంటి కుటుంబ సభ్యులు వెనక్కు తగ్గారు. విగ్నేష్ ఇంట్లో సైతం ఒప్పించారు. ఆ యువకుడు మాత్రం ఎలాగైనా తనకు ఇచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేసేవాడు.


ఇది చదవండి: ఒంటరి మహిళలే అతడి టార్గెట్.. మాటల్లోకి దించి లాడ్జికి తీసుకెళ్తాడు.. ఆపై మత్తుమందు ఇచ్చి..

ఈ క్రమంలో జూలై 12 పట్ట పగలు ఇంట్లోకి చొరబడి, యువతిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో ఉన్న యువతి తల్లి, సోదరుడు గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడ నుంచి విఘ్నేశ్వరన్ పారిపోయాడు. అప్పటి నుంచి యువతిని ఎత్తుకెళ్లేందుకు వివిధ రకాల పథకాలు, మరెన్నో వ్యూహాలు రచించాడు. చివరకు ఆగస్టు 3న కొంతమంది యువకులను వెంటబెట్టుకుని రాత్రి వేళ యువతీ ఇంటిపై దండయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. యువతి ఇంట్లోకి వెంట వచ్చిన యువకులతో సహా చొరబడ్డారు. కుటుంబ సభ్యులు అరిచి గగ్గోలు పెడుతున్నా.. వద్దని వేడుకుంటున్నా వినకుండా యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

ఇది చదవండి: వరుసకు చెల్లి.. ప్రేమ పేరుతో వేధింపులు.. చివరికి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..!


దీంతో యువతీ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమీపంలోని టోల్ ప్లాజా వద్ద కారును ఆపిన పోలీసులు.. యువతిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎత్తుకెళ్తున్న ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయినా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Kidnap, Tamil nadu

ఉత్తమ కథలు