YOUNG MAN TRY TO COMMITS SUICIDE IN LODGE DUE TO LOVE ISSUE IN GUNTUR DISTRICT FULL DETAILS HERE HSN
లాడ్జిలో రూమ్ తీసుకున్న బీటెక్ కుర్రాడు.. గదిలోంచి వస్తున్న అరుపులు కేకల్ని విని లాడ్జి సిబ్బంది వెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం
బీటెక్ చదివిన ఓ కుర్రాడు నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలోనే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఏం జరిగిందో ఏమో కానీ ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి కూడా వెళ్లకుండా దగ్గరలోని సిటీలో ఓ లాడ్జిలో రూం తీసుకున్నాడు.
ఈ తరం యువత చిన్న చిన్న కారణాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కారణంతో వారిని హతమార్చుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రేమ విఫలమయి ప్రాణాలు తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి జరిగింది. బీటెక్ చదివిన ఓ కుర్రాడు నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలోనే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఏం జరిగిందో ఏమో కానీ ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి కూడా వెళ్లకుండా దగ్గరలోని సిటీలో ఓ లాడ్జిలో రూం తీసుకున్నాడు. అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వీడియో తీసి మరీ కుటుంబ సభ్యులకు పంపాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని గురవాయ పాలేనికి చెందిన ధూళిపాళ్ల సత్యనారాయణ కొడుకు మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు చదువుకుని సిటీలో ఉద్యోగం చేస్తున్నాడని తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోష పడుతుండేవాళ్లు. అయితే మహేష్ కు చదువుకునే రోజుల్లోనే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి మధ్య గొడవలు జరిగాయో, బేధాభిప్రాయాలే వచ్చాయో ఏమో కానీ మహేష్ తన ఉద్యోగానికి సెలవులు పెట్టాడు. గుంటూరు జిల్లాకు చేరుకున్నాడు. నేరుగా తన ఇంటికి వెళ్లకుండా గోరంట్లలోని ఐడీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు.
బయటకు వెళ్లి ఎలుకల మందును కొనుక్కొచ్చుకున్నాడు. కూల్ డ్రింక్ లో ఆ ఎలుకల మందును పోసుకుని తాగాడు. బ్లేడుతో చేయి కూడా చేసుకున్నాడు. రక్తం పోవడాన్ని వీడియో తీసి, ఎలుకల మందు కూడా తాగానంటూ వీడియో రికార్డుచేసి తన కుటుంబ సభ్యులకు పంపాడు. ఇదే సమయంలో రక్తం పోవడంతో తీవ్ర నొప్పితో అతడు అరుస్తూ ఉన్నాడు. అతడి గదిలోంచి శబ్దాలు రావడంతో లాడ్జి సిబ్బంది అప్రమత్తమయ్యారు. తలుపులు పగలగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని 108లో జీజీహెచ్ కు తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చి అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిమిత్తమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమయి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.