Home /News /crime /

గొంతు కోసుకుంటేనే సినిమాల్లో ఛాన్స్‌.. సోదరుడు చెప్పాడని అతడు ఏం చేశాడో తెలుసా?

గొంతు కోసుకుంటేనే సినిమాల్లో ఛాన్స్‌.. సోదరుడు చెప్పాడని అతడు ఏం చేశాడో తెలుసా?

ఏపీలో దిశా తరహా ఘటన

ఏపీలో దిశా తరహా ఘటన

సినిమాల్లో అవకాశం రావాలంటే చనిపోకుండా ఉండేలా గొంతు కోసుకోవాలని సూచించినట్లు వెల్లడించాడు. తన సోదరుడు చెప్పినట్లే గొంతుకోసుకున్నానని, వీడియో తీసి అతడికి పంపినట్లు చెప్పాడు.

    ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో మంది చెప్పే డైలాగ్ ఇది. తెరపై తన బొమ్మ కనిపించాలని.. రంగుల ప్రపంచాన్ని ఏలాలని కళలు కంటుంటారు. పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కిడి నుంచే నగరాలకు వస్తారు. పొట్ట మాడ్చుకొని.. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. ఐతే ప్రతిభంతో పాటు కష్టపడేతత్వం, అదృష్టం ఉంటే తప్ప అంత ఈజీగా సినిమాల్లో ఛాన్స్‌లు రావు. సినిమాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి.. చివరకు విఫలమై.. సర్వం కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు సినిమాల్లో అవకాశాల కోసం గొంతు కోసుకున్నాడు. అలా చేస్తేనే ఆఫీర్లు వస్తాయని అతడి సోదరుడు చెప్పడంతో అలాగే చేశాడు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు గ్రామానికి చెందిన మారిముత్తుకు ప్రైవేటు ఉద్యోగి. ప్రస్తుతం తిరువళ్లూరు జిల్లాలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతడి తమ్ముడు చెన్నైలో ఉంటాడు. చాలా కాలంగా సినిమాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే మారుముత్తుకు కూడా సినిమాలపై మక్కువ పెరిగింది. మూవీల్లో నటించాలని తాను కూడా అనుకున్నాడు. అందుకోసం తమ్ముడి సలహాలు తీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. శుక్రవారం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన మారిముత్తు గొంతుకోసుకున్నాడు. ఎంతసేపటికీ అతడు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న మారిముత్తును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

    ఐతే స్వల్ప గాయమే కావడంతో అతడు కోలుకున్నాడు. అనంతరం పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించాడు. ఘటనపై పొంతన లేని సమాధానం చెబుతుండడంతో పోలీసులు తమదైన శైలిలో ఆరాతీశారు. చివరకు అసలు విషయం షాక్ తిన్నారు. సినిమాల్లో అవకాశం రావాలంటే చనిపోకుండా ఉండేలా గొంతు కోసుకోవాలని సూచించినట్లు వెల్లడించాడు. తన సోదరుడు చెప్పినట్లే గొంతుకోసుకున్నానని, వీడియో తీసి అతడికి పంపినట్లు చెప్పాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని పోలీసులకు తెలిపాడు. కనీసం అలా ఐనా సినిమాల్లో అవకాశాలు వస్తాయని భావించినట్లు పేర్కొన్నాడు. మారిముత్తు సమాధానం విని పోలీసులు షాక్ తిన్నారు. అన్నాదమ్ముళ్లు ఇద్దరిపైనా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chennai, Crime news, Kollywood, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు