కుంటాల జలపాతంలో మునిగి యువకుడి మృతి...జాగ్రత్త వహించాలని అటవీశాఖ హెచ్చరిక

జలప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు అడుగు భాగంలో రాతి ఉపరితలం కారణంగా నీటిలోకి జారిపడి బలమైన గాయం కావడంతో శ్రీకాంత్ మరణించాడని భావిస్తున్నారు.

news18-telugu
Updated: August 19, 2019, 10:33 PM IST
కుంటాల జలపాతంలో మునిగి యువకుడి మృతి...జాగ్రత్త వహించాలని అటవీశాఖ హెచ్చరిక
మృతుడు శ్రీకాంత్
  • Share this:
ప్రముఖ టూరిస్టు స్పాట్ కుంటాల జలపాతం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కుంటాల జలపాతంలో మునిగి ఊపిరి ఆడక మరణించాడు. సోమవారం ఉదయం తన స్నేహితులతో కలిసి కుంటాల జలపాతం వద్దకు విహార యాత్రకు వచ్చిన శ్రీకాంత్, నీటిలోకి దిగి జలపాతం దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కాగా జలప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు అడుగు భాగంలో రాతి ఉపరితలం కారణంగా నీటిలోకి జారిపడి బలమైన గాయం కావడంతో శ్రీకాంత్ మరణించాడని భావిస్తున్నారు. కాగా మృతదేహాన్ని నీటిలో వెతికేందుకు అటవీ శాఖ సిబ్బందితో పాటు పోలీసులు కూడా సహకరించారు. ఇదిలా ఉంటే కుంటాల జలపాతం సందర్శించేందుకు భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు.

సెలవు దినాల్లో దాదాపు 1000 కార్లు, 100 బస్సులు, మరో 1000 ద్విచక్ర వాహనాలు కుంటాల సమీపంలో పార్కింగ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పార్కింగ్ స్థలం లేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయాయి. అటు పోలీసులు సైతం చేతులెత్తేయడంతో పరిస్థితి అదుపు తప్పుతుందేమోనని అధికారుల్లో ఆందోళన మొదలైంది.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు