వాట్సప్ ద్వారా మహిళకు అశ్లీల చిత్రాలు పంపుతున్న యువకుడు...చివరకు ఏం జరిగిందంటే..?

ఆ యువకుడు తన సెల్‌ నెంబర్‌ నుంచి ఆమె ఫోన్‌కు రోజులుగా ఆశ్లీల ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడం ప్రారంభించాడు. అంతే కాదు ఆమెకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు.

news18-telugu
Updated: September 15, 2019, 10:56 PM IST
వాట్సప్ ద్వారా మహిళకు అశ్లీల చిత్రాలు పంపుతున్న యువకుడు...చివరకు ఏం జరిగిందంటే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుర్తుతెలియని మహిళకు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన యువకుడు పట్టణంలోనే డిగ్రీ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల కిందట నగరంలోని ఓ మహిళా చిరునామా, సెల్‌ నెంబర్‌ రహస్యంగా సంపాదించాడు. ఆ యువకుడు తన సెల్‌ నెంబర్‌ నుంచి ఆమె ఫోన్‌కు రోజులుగా ఆశ్లీల ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడం ప్రారంభించాడు. అంతే కాదు ఆమెకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. ఆ మహిళ ఎంత మందిలించినా యువకుడి ప్రవర్తన మారలేదు.

దీంతో బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని ఫోన్ ద్వారా ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అదేశాలు మేరకు రిమాండ్‌కు తరలించారు.
Published by: Krishna Adithya
First published: September 15, 2019, 10:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading