30 మంది మహిళలను రేప్ చేసిన యువకుడు... ఫోటోలు తీసి వారి నుంచి లక్షలు లాగేసి...

నిమిషాల్లో మాటలు... గంటల్లో స్నేహం... నమ్మించి లొంగదీసుకుని శృంగారం, లొంగకపోతే అత్యాచారం చేసి బ్లాక్‌మెయిల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 10:11 PM IST
30 మంది మహిళలను రేప్ చేసిన యువకుడు... ఫోటోలు తీసి వారి నుంచి లక్షలు లాగేసి...
30 మంది మహిళలను రేప్ చేసిన యువకుడు... వారి నుంచి లక్షలు లాగేసి...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 10:11 PM IST
ప్లేబాయ్ అనే పదం అతనికి చాలా చిన్నది. సీరియల్ రేపిస్ట్ అనే పదం కూడా పెద్దగా సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఒకరిద్దరినో లేక ఏ పదిమందినో కాదు... 30 మందికి పైగా మహిళలను రేప్ చేసి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ చిత్రహింసలు పెట్టాడతను. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఛత్తీస్‌ఘడ్‌లోని బియెల్లీ దగ్గర్లో ఉన్న వైశాలీనగర్ ఏరియాకు చెందిన గగన్‌దీప్ సింగ్ అలియాస్ రిచే... అమ్మాయిలకు మాటలతో పడేసి, లొంగదీసుకోవడంలో దేశముదురు. నిమిషాల్లో మాటలు కలిపి, గంటల్లో స్నేహం పెంచుకుని దగ్గరై పోయే గగన్‌దీప్ సింగ్... ప్రేమ పేరుతో అమ్మాయిలకు దగ్గరవుతాడు. అతని మత్తైన మాటలు నమ్మిన అమ్మాయిలు... పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. వారి ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే గగన్‌దీప్... వారిని తన గదికి తీసుకెళ్తాడు. అక్కడ వారిని లొంగదీసుకుని శృంగారం చేస్తాడు. లొంగకపోతే అత్యాచారానికి పాల్పడతాడు. తన గదిలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ దృశ్యాలను రికార్డు చేసి... వాటిని చూపించి లక్షలు డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, అందినకాడిని తీసుకుని తప్పించుకునేవాడు. ఇలా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్, బియెల్లీ ఏరియాల్లో మహిళలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రాయ్‌పూర్, జగ్దల్‌పూర్, జోధ్‌పూర్, ఇండోర్ ఏరియాల్లో అమ్మాయిలను ఈ విధంగా ట్రాప్ చేసి మోసం చేశాడు గగన్‌సింగ్.

పోలీసులకు చెబితే ఫోటోలు, వీడియోలను బూతు సైట్లలో పెడతానని బెదిరించడంతో ఎవ్వరూ గగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అయితే బియెల్లీ ఏరియాకు చెందిన ఓ మహిళ, తనకు జరిగిన అనుభవాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితుడిగా పరిచయమైన గగన్‌ను ఇంటికి పిలిస్తే.. ఎవ్వరూ లేని సమయంలో తనపై అత్యాచారం చేసిన అతను... రెండు లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని, తన భర్తకు పంపిస్తానని బెదిరించడం మొదలెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... గగన్‌దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసి, అతని మొబైల్‌ చెక్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇలా పెళ్లైన మహిళలు, కాలేజీకెళ్లే స్టూడెంట్స్‌తో మాటలు కలిపిన అతను... అత్యాచారం చేయడం, వారిని లొంగదీసుకుని శృంగారం చేయడం చేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ దృశ్యాలు ఫోటోలు, వీడియోల్లో బంధించి బాధితుల నుంచి లక్షలు వసూలు చేశాడని నిర్ధారణ అయ్యింది. గగన్‌దప్ సింగ్ కేసును ఛాలెజింగ్‌గా తీసుకున్న పోలీసులు... అతను ఎంత మందిపై అత్యాచారం చేశాడు? వారి నుంచి ఎంత వసూలుచేశాడనే విషయాలను తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...