యువకుడు విమానంలో టాయిలెట్లోకి వెళ్లి సిగరెట్ట కాల్చాడడంతో ఒక్కసారిగా విమానంలోని ఫైర్ అలారం మోగింది. దీంతో విమానంలోని ప్రయాణీకులు ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన వైమానిక సిబ్బంది టాయిలెట్ వద్దకు వెళ్లి తలుపు తట్టారు.
అబుదాబి నుంచి ముంబై వెళ్తున్న విమానంలో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. ఆకాశ మార్గంలోనే ప్రయాణీకులందరికీ చెమటలు పెట్టించాడు. వివరాల్లోకి వెళితే తుషార్ చౌదరి అనే 27 ఏళ్ల యువకుడు విమానంలో టాయిలెట్లోకి వెళ్లి సిగరెట్ట కాల్చాడడంతో ఒక్కసారిగా విమానంలోని ఫైర్ అలారం మోగింది. దీంతో విమానంలోని ప్రయాణీకులు ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన వైమానిక సిబ్బంది టాయిలెట్ వద్దకు వెళ్లి తలుపు తట్టారు. అయితే నడి ఆకాశంలో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే టాయిలెట్ తలుపు తట్టినా తుషార్ తలుపు తీయకపోవడంతో మరో తాళం సాయంతో సిబ్బంది తలుపు తెరిచారు. అయితే టాయిలెట్ లోపల తుషార్ మాత్రం సరదాగా సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. దీంతో ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతు అయ్యింది. అయితే జరిగిన విషయాన్ని ముంబై విమానాశ్రయానికి తెలియజేయగా,విమానం ముంబైలో ల్యాండవ్వగానే తుషార్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.