బాబాయ్ చేతిపై టాటూ.. అది తన తల్లి పేరేనని గుర్తించిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి  బాబాయ్ చేతి మీద తన తల్లి పేరు టాటూ వేయించుకోవడం గమనించాడు. ఇందుకు సంబంధించి అతనితో గొడవకు దిగాడు.

 • Share this:
  ఓ వ్యక్తి  బాబాయ్ చేతి మీద తన తల్లి పేరు టాటూ వేయించుకోవడం గమనించాడు. ఇందుకు సంబంధించి అతనితో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే వారిమధ్య అభ్యంతరకర మాటలు చోటుచేసుకున్నాయి. చివరకు అతడు బాబాయ్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిర్సి రోడ్డు ప్రాంతానికి చెందిన రాజ్ అగర్వాల్, అతని స్నేహితుడు వైశాలి నగర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించాడు. వివరాలు.. శశి కుమార్ అగర్వాల్(44) పోర్ట్‌బ్లెయిర్‌లో వ్యాపారం చేస్తున్నాడు. అతడు కొద్ది రోజుల క్రితం జైపూర్‌లోని పూర్వీకుల ఇంటికి వచ్చాడు.

  అయితే అక్కడే ఉంటున్న రాజ్ అగర్వాల్‌ను శశి కలిశాడు. ఆ తర్వాత రాజ్, శశిలతో పాటు మరికొందరు స్నేహితులు కలిసి మద్యం సేవించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత రాజ్.. శశి చేతిపై తన తల్లి(ఆమె శశికి అన్న భార్య) పేరు పచ్చబొట్టుగా ఉండటం గుర్తించాడు. ఆ తర్వాత రాజ్, శశిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే శని.. రాజ్‌తో అభ్యంతరకరమైన విషయాలు చెప్పాడు. దీంతో ఆవేశపడిన రాజ్.. పదునైన ఆయుధంతో శశిపై దాడి చేశాడు. ఆ తర్వాత మొబైల్ చార్జర్ కేబుల్‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు.

  అనంతరం రెంటల్ కంపెనీ నుంచి రాజ్ కారు బుక్ చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి శశి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి కారులో ఎక్కించారు. ఆ తర్వాత మృతదేహం కారులో ఉంచుకునే సిటీలోని పలుచోట్ల తిరిగారు. మృతదేహం పడేసేందుకు అనువైన ప్రదేశం కోసం వెతికారు. ఇక, మంగళవారం అర్ధరాత్రి భంక్రోట ప్రాంతంలో గోయి తీసి పూడ్చే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకోగా.. రాజ్, ప్రకాశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: