YOUNG MAN KILLED FOR SORE THROAT MUDDY AND CHILLI POWDER EXTINGUISHED IN MIRYALAGUDA DISTRICT VB
Attempt to murder: గొంతు కోసి.. కారం చల్లి.. వేట కొడవలితో దారుణ హత్య.. సొంత అన్న అతడి స్నేహితులు కలిసి..
ప్రతీకాత్మక చిత్రం
Attempt to murder: తమ్ముడిని సొంత పెద్దనాన్న కొడుకు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి దారుణంగా నరికి పొలంలో పడేసి వెళ్లిపోయారు. పైగా ఎవరికీ దొరకకుండా శవంపై కారం చల్లి పరారయ్యారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం శివారులో చోటుచేసుకుంది.
ఓ యువకుడు తన అమమ్మ దశ దిన కర్మకు హాజరయ్యాడు. ఆ గ్రామంలో కార్యక్రమం పూర్తి చేసుకొని తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అతడితో పాటు అత్త వీరమ్మ, మామ వెంకటయ్యలను కూడా ఎక్కించుకున్నాడు. ఆ ముగ్గురు ద్వి చక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో ఓ సుమో వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ముగ్గురు కింద పడిపోయారు. వెంటనే సుమో నుంచి ఐదుగురు ఆ యువకుడిపై వేట కత్తులతో దాడికి ప్రయత్నించాడు. ఆ యువకుడు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అత్త, మామ కంగారు పడి అరవడం మొదలు పెట్టారు. ఆ యువకుడిని వెంబడించి పంట పోలంలోకి వెళ్లడం గమనించిన ఆ ఐదుగురు వేట కొడవలితో మెడ నరికేశారు. ఆ యువకుడి శవాన్ని పొలంలోనే పడేసి దానిపై కారం చల్లి అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (22) నిడమనూరు మండలం రేగులగడ్డలో తన అమ్మమ్మ దశదిన కర్మకు హాజరయ్యాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక అత్త వీరమ్మ, మామ వెంకటయ్యలతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. దారిలో కొంతమంది దుండగులు సుమో వాహనంలో వచ్చి శ్రీకాంత్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ రహదారిపై పడిపోయారు. శ్రీకాంత్ వరి పొలాల్లోకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దుండగులు వెంటపడి శ్రీకాంత్‌ను చుట్టుముట్టి మెడపై వేట కొడవలితో నరికారు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే మరణించాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాలియా సీఐ వీర రాఘవులు, నిడమనూరు ఎస్ఐ కొండల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు పాల్పడింది శ్రీకాంత్ సొంత పెద్దమ్మ కొడుకు ఒంగూరి మహేందర్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి అక్క వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు ఆధారాలు దొరకకుండా కారం చల్లి పోరిపోయారని పోలీసులు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.