నగ్నచిత్రాలతో ప్రియురాలికి యువకుడి వేధింపులు.. కానిస్టేబుల్స్ సహకారం..

యువతి ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. అప్పటి నుంచి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని పోర్న్ సైట్లలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. భయపడిపోయిన ఆ విద్యార్థిని ఇప్పటికే రూ.2లక్షలు నగదుతో పాటు రెండు బంగారు గాజులు ఇచ్చింది.

news18-telugu
Updated: July 9, 2020, 12:37 PM IST
నగ్నచిత్రాలతో ప్రియురాలికి యువకుడి వేధింపులు.. కానిస్టేబుల్స్ సహకారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడు ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని వంచించాడు. నగ్న చిత్రాలు తీసి బంగారం, డబ్బులు వసూలు చేశాడు. అడిగినంత ఇవ్వాలంటూ ఓ ఇద్దరు కానిస్టేబుల్స్‌తో కలిసి బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిపోయిన సదరు విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం జంగాలపల్లెకు చెందిన పులుకూరి శివానంద్ నరసరావుపేటకు చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ప్రేమించాడు. అయితే ఆ యువకుడు నరసరావుపేట పట్టణంలోని ఓ పురుగుల మందు దుకాణంలో పనిచేసేవాడు. లాక్‌డౌన్ అనంతరం ఎరువుల దుకాణంలో ఉద్యోగం మానేశాడు.  ఈ క్రమంలోనే ప్రియురాలు అయిన బీటెక్ విద్యార్థినితో ఏకాంతంగా ఉన్న సమయంలో యువకుడు ఫొటోలు, వీడియోలు తీశాడు. అప్పటి నుంచి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని పోర్న్ సైట్లలో పెడతానంటూ విద్యార్థినిపై బెదిరింపులకు దిగాడు.

భయపడిపోయిన ఆ విద్యార్థిని ఇప్పటికే రూ.2లక్షలు నగదుతో పాటు రెండు బంగారు గాజులు ఇచ్చింది. అయినా సదరు యువకుడు ఈపూరు, రొంపిచర్ల పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ అయిన అప్పలనాయుడు, శ్రీను సహకరంతో మరింత వేధింపులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థిని తనను ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ వేధిస్తున్నారంటూ గుంటూరు రూరల్ ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేసింది.

దీంతో శివానంద్ అసలు బాగోతం బయటపడింది. సదరు యువకుడు గతంలోనూ పలువురు యువతులను ప్రేమపేరుతో ముగ్గులోకి దింపి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివానంద్‌కు కానిస్టేబుల్స్‌తో పాటు మరికొందరు సహకరించినట్టు విచారణలో గుర్తించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరారెడ్డి పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading