హోమ్ /వార్తలు /క్రైమ్ /

త్వరలోనే ఆ టీనేజర్ అమ్మాయితో ప్రేమ పెళ్లి... అంతలోనే ఆ కుర్రాడు చేసిన పనికి ఏమైందంటే...

త్వరలోనే ఆ టీనేజర్ అమ్మాయితో ప్రేమ పెళ్లి... అంతలోనే ఆ కుర్రాడు చేసిన పనికి ఏమైందంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మైనర్‌కి పెళ్లి చేయడం నేరం. అయినా సరే... తన కూతురు ఎవరో కుర్రాణ్ని ప్రేమించింది కాబట్టి... ఆమె... అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు తండ్రి. కానీ అంతలోనే ఓ ఘోరం జరిగింది. ఆ తర్వాతేమైంది?

అది గుజరాత్‌... సూరత్‌లోని బెస్తాన్ ఏరియా. అక్కడి ఓ మైనర్ వెంటపడ్డాడు ఓ కుర్రాడు. అతను బెస్తాన్ ఏరియాలోని గోల్డెన్ ఫ్లాట్‌లో ఉంటుంది. పేరు మహ్మద్ సాజిద్ జారా. 15 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆమె... అతని ఫ్లాట్‌కి ఎదురుగా ఉన్న సొసైటీలోనే ఉండేది. రోజూ వెంటపడి... ప్రేమా ప్రేమా అంటుంటే... బైక్‌పై రయ్యిన తిరిగే అతన్ని చూసి... తెలిసీ తెలియని వయసులో ఆమె కూడా ఆకర్షితురాలైంది. ఆ తర్వాత పెద్దలకు తెలియకుండా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఓ రోజు ఎవరో అమ్మాయి తండ్రికి విషయం చెప్పి... మీ అమ్మాయిని హద్దుల్లో పెట్టుకోండి అనడంతో... ఆయన తల కొట్టేసినట్లు ఫీలయ్యాడు. ఇంట్లో డిస్కషన్ నడిచింది. అతన్ని ప్రేమిస్తున్నానని తండ్రి ముందు ధైర్యంగా చెప్పింది.

నీ వయసేంటీ... నీ మాటలేంటని మండిపడ్డాడు తండ్రి. ఆ తర్వాత... తన కూతురి జీవితం ఏమవుతుందో, ఇంటి పరువు పోతుందేమో అని అనుకుంటూ... సరే అని పెళ్లికి ఒప్పుకున్నాడు. రెండువైపులా పెళ్లికి అంగీకారం కుదిరింది. త్వరలోనే పెళ్లి. నిజానికి ఆమె మైనర్. 18 ఏళ్లు నిండలేదు. అప్పుడే ఆమెకు పెళ్లి చేయకూడదు. కానీ... తమ సొసైటీలో వారు నలుగురూ, నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే భరించలేక... ఆ తండ్రి... పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: పొలంలో పనిచేసుకుంటున్న యువతిపై అత్యాచార యత్నం... ఆ తర్వాత చూస్తే గొయ్యిలో...

ఇంతలో సాజిద్... ఆమెను తన ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి... ఆమెను రేప్ చేశాడు. అప్పటికే ఆమెను అతను ఏడాది కాలంలో 2సార్లు రేప్ చేశాడు. ఇది మూడోసారి. త్వరలోనే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇదేంటి... వద్దు అని ఆమె చెప్పినా... వినలేదు. ఏం కాదులే... త్వరలోనే పెళ్లి అయిపోతుందిగా అని నాటకాలు ఆడాడు. ఇది ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. తన ఇష్టం లేకుండా ఇందంతా జరుగుతోంది అనుకుంది. పెళ్లికి ముందే తనను అర్థం చేసుకోని వాడు... పెళ్లయ్యాక మాత్రం తన మాటకు గౌరవం ఇస్తాడని గ్యారెంటీ ఏముంది... అనుకుంది... తండ్రి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పింది. పెళ్లికి ముందే మూడుసార్లు రేప్ చేశాడని తెలియడంతో... ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి... నాకు మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా సరే... నువ్వు ప్రేమించావని ఒప్పుకున్నా... ఇక ఇంతకు తెగించాక... వాణ్ని వదిలేదే లేదు అంటూ... అత్వా పోలీస్ స్టేషన్‌లో రేప్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు రాసి... సాజిద్‌ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి దర్యాప్తు చేసి... కేసుపై ముందుకెళ్తామని చెప్పారు. ఇందులో మరోకోణం ఏంటంటే... ఓ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలో పనిచేస్తున్న సాజిద్... అమ్మాయి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాడని తెలిసింది.

First published:

Tags: Gujarat, Minor rape, Sex

ఉత్తమ కథలు