Home /News /crime /

YOUNG MAN FROM WEST BENGAL COMMITTED SUICIDE BY MAKING A VIDEO CALL SSR

Wife Video Call: ఎంతటి విషాదం.. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడిన కొద్దిసేపటికే..

నజీర్, జరీనా

నజీర్, జరీనా

జరీనా, నజీర్ ఖాన్(31) భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నజీర్ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే.. ఆ డబ్బు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు. అప్పటికే చాలా అప్పులున్నాయి. ఈ అప్పుల భారం నజీర్‌ను కుంగదీసింది. దీనికి తోడు లాక్‌డౌన్ కారణంగా ఉన్న ఉద్యోగం కూడా పోయింది.

ఇంకా చదవండి ...
    కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో విషాద ఘటన జరిగింది. దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిగా తన భార్యకు వీడియో కాల్ చేసి ఆ తర్వాత బైపాస్ పక్కనున్న చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జరీనా, నజీర్ ఖాన్(31) భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నజీర్ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే.. ఆ డబ్బు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు. అప్పటికే చాలా అప్పులున్నాయి. ఈ అప్పుల భారం నజీర్‌ను కుంగదీసింది. దీనికి తోడు లాక్‌డౌన్ కారణంగా ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దీంతో.. నజీర్‌కు భార్యాపిల్లలను పోషించడమే కష్టంగా మారింది. ఈ క్రమంలోనే అప్పులిచ్చిన వాళ్ల నుంచి తిరిగి చెల్లించాలని ఒత్తిడి ఎక్కువైంది. ఈ కారణాలన్నీ నజీర్‌ను మానసికంగా బలహీనుడిని చేశాయి. ఇక ఆత్మహత్యే శరణ్యమని భావించాడు.

    బెనెచాందిని బైపాస్ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న ఓ తోటలో ఉండి భార్యకు చివరిసారిగా వీడియో కాల్ చేశాడు. తనకు బతకాలని లేదని, చనిపోతున్నానని కన్నీరుమున్నీరయ్యాడు. ఆ ఒక్క మాట భార్యకు చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. భర్త ఒక చెట్టు కింద ఉండి మాట్లాడుతున్న విషయం వీడియో కాల్‌లో అర్థమైంది గానీ అది ఏ ప్రాంతమన్నది జరీనాకు తెలియలేదు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి అందరూ కలిసి చాలాచోట్ల నజీర్ ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నజీర్.. గురువారం ఉదయం విగత జీవిగా మిగిలాడు.

    బైపాస్ పక్కన తోటలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఓ చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా మిగిలిన నజీర్ మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అప్పులే ఆత్మహత్యకు కారణమయ్యాయని తెలిసింది. భర్త లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన జరీనా గుండెలవిసేలా రోదించింది. ఆమె ఆర్తనాదాలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Suicide, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు