Hyderabad: హైదరాబాద్‌లోకి మీలాంటోళ్లంతా ఎక్కడ నుంచి ఊడిపడ్డార్రా.. సైదాబాద్ ఘటన మరువక ముందే...

నిందితుడికి దేహశుద్ధి చేస్తున్న స్థానికులు

భాగ్య నగరంగా పిలుచుకునే హైదరాబాద్‌లో అబలల రక్షణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమ్మాయిగా పుట్టడమే పాపమన్నట్టుగా.. కొందరు మగాళ్లు మృగాళ్లుగా మారి ఆడవాళ్లపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పసి మొగ్గలనే కనికరం కూడా లేకుండా కామంతో కళ్లుమూసుకు పోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

 • Share this:
  హైదరాబాద్: భాగ్య నగరంగా పిలుచుకునే హైదరాబాద్‌లో అబలల రక్షణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమ్మాయిగా పుట్టడమే పాపమన్నట్టుగా.. కొందరు మగాళ్లు మృగాళ్లుగా మారి ఆడవాళ్లపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పసి మొగ్గలనే కనికరం కూడా లేకుండా కామంతో కళ్లుమూసుకు పోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన జరిగి రోజులు కూడా గడవక ముందే హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో మరో దారుణం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన పదేళ్ల బాలిక మంగళవారం ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది.

  సైకిల్ తొక్కుతూ ఉన్న ఆ బాలిక దగ్గరకు ఓ యువకుడు వచ్చాడు. అంతకు ముందు తనతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి ఆ యువకుడే అని గుర్తుపట్టిన ఆ బాలిక భయంతో కేకలు వేసింది. ఆ బాలిక కేకలు విని ఏమైందోనన్న కంగారులో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు జనం అక్కడికి వెళ్లారు. తనతో అసభ్యంగా ప్రవర్తించింది ఇతనేనని, మళ్లీ దగ్గరకు రాబోయాడని బాలిక చెప్పడంతో ఆ యువకుడిని పట్టుకుని.. రెండు చేతులు కట్టేసి స్థానికులు, ఆ బాలిక కుటుంబ సభ్యులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

  ఆగస్ట్ 31న.. ఈ ఘటన జరగడానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు సదరు బాలిక రోడ్డుపై వెళుతుండగా.. ఇదే యువకుడు ఆమెను అడ్డగించి మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమెను తాకరాని చోట తాకుతూ, ఒళ్లంతా తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. భయంతో బాలిక అతని బారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లింది. ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ యువకుడు ఎవరని తల్లిదండ్రులు అడగ్గా.. పేరు తెలియదని, కానీ ఇదే ప్రాంతంలో ఉంటాడని చెప్పింది. ఈసారి మళ్లీ ఎప్పుడైనా ఆ యువకుడు కనిపిస్తే చెప్పాలని, ధైర్యంగా ఉన్నామని తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు.

  ఇది కూడా చదవండి: Very Sad: ఘోరం జరిగిపోయింది.. కారు, బస్సు ఢీ కొని మంటలు రేగిన వైనం.. కారు డోర్లు ఓపెన్ కాకపోవడంతో..

  మంగళవారం నాడు ఆ యువకుడు సదరు బాలికకు కనిపించడం, ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రక్షాపురం ప్రాంతానికి చెందిన ముజీబుర్ రెహమాన్ అనే 21 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఆగస్ట్ 31న మద్యం సేవించి ఉన్న తాను, రోడ్డుపై ఆ బాలికతో తప్పుగా ప్రవర్తించిన విషయం నిజమేనని నిందితుడు ఒప్పుకున్నాడు. తాగిన మైకంలో అలా చేశానని నిందితుడు చెప్పాడు. ఆ యువకుడు నేరం అంగీకరించడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ యువకుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: