Home /News /crime /

YOUNG MAN FROM CHENNAI COMMITTED SUICIDE AS HIS GIRLFRIEND WAS ALREADY MARRIED SSR

ఎఫ్‌బీలో యువతితో లవ్.. పెళ్లి చేసుకుందామని తాళితో ఆమె ఇంటికి.. ఊహించని విధంగా..

ప్రేమించిన యువతితో భూపతి

ప్రేమించిన యువతితో భూపతి

ఫేస్‌బుక్‌లో ఓ యువతితో పరిచయం యువకుడి ప్రాణం తీసింది. ఆ యువతి దాచిన నిజంతో యువకుడి హృదయం ముక్కలైంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా పుదుపాలయం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతికి...

ఇంకా చదవండి ...
    చెన్నై: ఫేస్‌బుక్‌లో ఓ యువతితో పరిచయం యువకుడి ప్రాణం తీసింది. ఆ యువతి దాచిన నిజంతో యువకుడి హృదయం ముక్కలైంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా పుదుపాలయం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతికి చెన్నైకి చెందిన భూపతి(24) అనే యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సెంగం సమీపంలో కీళపాలూరు ప్రాంతంలో ఆ యువతి భర్త, పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటోంది. చెన్నై తాంబరం సేలయూరుకు చెందిన భూపతితో ఎఫ్‌బీ ద్వారా పరిచయం పెంచుకున్న యువతి తనకు పెళ్లయిన విషయాన్ని దాచి అతనితో స్నేహం పెంచుకుంది. ఈ క్రమంలోనే భూపతి ఆ యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని ఆమెతో చెప్పాడు.

    పెళ్లై పిల్లలున్న ఆ వివాహిత తనకు పెళ్లయిందన్న విషయం చెప్పడం మానేసి ఆ ప్రేమను అంగీకరించింది. దాదాపు 8 నెలల పాటు ఒకరినొకరు వీడియో కాల్స్‌లో చూసుకుంటూ, ఫేస్‌బుక్‌ చాట్ చేస్తూ ప్రేమించుకున్నారు. ఈ నెల 20న సాలెంలో స్నేహితుడిని కలిసి వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన భూపతి ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే ఒడిలో చిన్న పాపతో ఆ యువతి ఉండటాన్ని చూసి భూపతి షాకయ్యాడు. ఇదేంటని ఆమెను ప్రశ్నించగా.. తనకు అప్పటికే పెళ్లయిందని, తన భర్త ఉపాధి నిమిత్తం వేరే దేశంలో ఉంటున్నాడని ఆమె బదులిచ్చింది. ఆమె సమాధానంతో విస్తుపోయిన భూపతి వాదనకు దిగాడు.

    పెళ్లయిన విషయం తనకు ముందే ఎందుకు చెప్పలేదని నిలదీశాడు. చివరికి ఎట్టకేలకు వాదన సద్దుమణిగింది. ఆ యువతి ఇంట్లోనే భూపతి రెండు రోజుల పాటు ఉన్నాడు. ఆమె షాప్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి భూపతి లోపల ఉండి గడియ పెట్టుకున్నాడు. భయంతో కిటికీలో నుంచి ఆ యువతి చూడగా ఆమె చీరతోనే అప్పటికే భూపతి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భూపతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. భూపతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఓ విషయం వెలుగుచూసింది. ఆ యువతిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో భూపతి ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో తాళిని కూడా తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Facebook, Lovers, Marriage, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు