Telangana: హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్న ఈ కుర్రాడు ఎవరన్నది తెలిసి కారు డ్రైవర్ కంగుతిన్నాడు.. పీఏ పరేషాన్ అయ్యాడు..!
Telangana: హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్న ఈ కుర్రాడు ఎవరన్నది తెలిసి కారు డ్రైవర్ కంగుతిన్నాడు.. పీఏ పరేషాన్ అయ్యాడు..!
నిందితుడు, పోలీసులు రికవరీ చేసిన సొత్తు (ఫైల్ ఫొటోలు)
బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడికి కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా ఓ పీఏను కూడా పెట్టుకున్నాడు. కానీ అతడు చదివేది బీటెక్ అని వాళ్లకు తెలియదు. జాయింట్ కలెక్టర్ అని మాత్రమే వాళ్లిద్దరికీ తెలుసు. చివరకు అతడెవరన్నది తెలిసి..
ఆ కుర్రాడు చదివేది బీటెక్. కానీ అతడు మాత్రం ఓ మోసాల పుట్ట. ఉద్యోగం రాకముందే వచ్చినట్టు కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఊళ్లో అందరికీ చెప్పి మోసపుచ్చాడు. మాయమాటలు చెప్పి మభ్యపెట్టాడు. ఓ కారును కొన్నాడు. దానికి డ్రైవర్ ను కూడా పెట్టుకున్నాడు. పీఏను కూడా నియమించుకున్నాడు. (నిందితుడి ఫైల్ ఫొటో, రికవరీ చేసిన సొత్తు)
అతడి ఆర్భాటాలు, హంగులు చూసిన బంధువులు, ఊళ్లో వాళ్లు నమ్మేశారు. జాయింట్ కలెక్టర్ ను అయిన తనకు అనధికారికంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు వెసులుబాటు ఉందనీ, ఒక్కో ఉద్యోగానికి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాడు. నిజమే కాబోలు అనుకున్న బంధువులు అతడికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. (నిందితుడి ఫైల్ ఫొటో)
29 మంది నిరుద్యోగుల వద్ద నుంచి 80 లక్షల రూపాయల వరకు కొల్లగొట్టాడు. కానీ చివరకు అతడి మోసం బయటపడింది. మంచిర్యాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.(రికవరీ చేసిన సొత్తు)
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లికి చెందిన బర్ల లక్ష్మీనారాయణ అనే యువకుడు హైదరాబాద్ లో బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. 2019వ సంవత్సరంలోనే అతడు రైల్వే ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు.(రికవరీ చేసిన సొత్తు)
ఆ సమయంలోనే అతడికి జాబ్ రాకున్నా వచ్చినట్టు తల్లిదండ్రులను నమ్మించాడు. ఊళ్లో వాళ్లకు కట్టుకథలు చెప్పాడు. గ్రామస్తులు కూడా నిజమని నమ్మి సన్మానం కూడా చేశారు. లాక్ డౌన్ సమయంలో ఊళ్లోనే ఉన్న లక్ష్మీనారాయణ గ్రామస్తులతో తన పరిచయాన్ని ఇంకాస్త విస్తృతం చేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ లో బీటెక్ చేసే సమయంలోనే చేసిన మోసాలతో ఓ కారును కొన్నాడు. దానికి ఓ వ్యక్తిని డ్రైవర్ గా పెట్టుకున్నాడు. తాను మంచిర్యాల జాయింట్ కలెక్టర్ గా సెలెక్టయ్యానంటూ మరో కట్టు కథ అల్లాడు. ఎక్కడకు వెళ్లినా కార్లో వెళ్తూ రావడం, డ్రైవర్, పీఏ ఉండటం చూసి గ్రామస్తులు, బంధువులు నమ్మేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ తర్వాతే అతడు అసలుమోసానికి తెరలేపాడు. జాయింట్ కలెక్టర్ ను అయిన తనకు 30 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలను అనధికారికంగా ఇవ్వొచ్చని చెబుతూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఉద్యోగ స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పాడు. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన దాదాపు 29 మంది నిరుద్యోగులు అతడి వలలో పడ్డారు. రూ.80 లక్షల వరకు లక్ష్మీనారాయణ కొల్లగొట్టాడు. ఈ డబ్బుతో జగిత్యాలలో ఇల్లు, రెండు కార్లు, బైక్, ఓ చోట స్థలం కూడా కొన్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
డబ్బు ఇచ్చి ఎంత కాలం అయినా జాబ్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఏప్రిల్ 12న మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అతడు ఎన్నో మోసాలు చేసినట్టు విచారణలో తెలియడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతడి వద్ద ఉన్న రూ.2 లక్షల రూపాయలు, రెండు కార్లు, బైక్ స్వాధీనం చేసుకన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తాము ఓ మోసగాడి వద్ద పనిచేస్తున్నామని తెలిసి కారు డ్రైవర్, పీఏ అవాక్కయ్యారు. తమకేమీ తెలియదని వాపోయారు. వాళ్లు అమాయకులేనని తెలియడంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.