Home /News /crime /

YOUNG MAN DIES AND ONE INJURED IN A ROAD ACCIDENT IN AMEERPET SA

ఘోర రోడ్డు ప్రమాదం.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయిన తల

road accident

road accident

హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో బైక్ నడిపి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు.

    హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో బైక్ నడిపి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు ఇద్దరూ యువకులు. శ్రీకాకుళానికి చెందిన గిరీష్‌ గుప్తా,రవితేజ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం ద్విచక్రవాహనంపై ఈ ఇద్దరూ స్నేహుతులు కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. అతివేగంతో వెళ్తున్న వీరి బైక్ అదుపుతప్పి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద ప్రమా దానికి గురయ్యారు. మీతి మీరిన వేగంతో ఉన్న బైక్ మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో పక్కన పడింది. ఈ క్రమంలో గిరీష్‌ గుప్తా తల రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

    మరో యువకుడు రవితేజకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రైలింగ్‌లో ఇరుక్కుపోయిన గుప్తాను బయటకు తీయడానికి గ్యాస్‌కట్టర్‌తో ఇనుప కడ్డీలను తొలగించారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Ameerpet, Road Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు