తెలంగాణలో దారుణం... మంచం మీద నుంచి కిందపడి యువకుడి మృతి

అర్ధరాత్రి మెలుకువ రావడంతో మరో స్నేహితుడు లాల్‌మాల్ సౌమ నిద్రలేచాడు. అప్పటికి కిందపడి ఉన్న మిత్రుడిని చూశాడు. అతడ్ని లేపే ప్రయత్నం చేశాడు. ఎంతకి లేవకపోవడంతో... అతడిలో కదలిక లేకపోవడంతో వెంటనే రిసార్ట్స్ సిబ్బందికి సమాచారం అందించారు.

news18-telugu
Updated: February 16, 2020, 8:07 AM IST
తెలంగాణలో దారుణం... మంచం మీద నుంచి కిందపడి యువకుడి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మంచం మీద పడుకున్న వ్యక్తి నిద్రలో కింద పడి మృతి చెందిన షాకింగ్ ఘటన హైదరాబాద్ శివారుల్లో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడు బర్త్‌డే సందర్భంగా ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. మద్యం తాగి నిద్రపోయిన ఓ యువకుడు మంచంపై నుంచి కిందపడి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్ నుంచమ అనే 23 ఏళ్ల యువకుడు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేటలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం తనకు కేటాయించిన గదిలోని బంక్‌బెడ్‌పై లాల్ నిద్రపోయాడు. అయితే, అర్ధరాత్రి మెలుకువ రావడంతో మరో స్నేహితుడు లాల్‌మాల్ సౌమ నిద్రలేచాడు. అప్పటికి కిందపడి ఉన్న మిత్రుడిని చూశాడు. అతడ్ని లేపే ప్రయత్నం చేశాడు. ఎంతకి లేవకపోవడంతో... అతడిలో కదలిక లేకపోవడంతో వెంటనే రిసార్ట్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం. రిసార్ట్స్‌కు చేరుకున్న 108 సిబ్బంది లాల్‌ను పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాల్‌ కిందపడ్డ వేళ మరణించాడా? లేక మరేమైన కారణాలు ఉన్నాయా? గుండెపోటు వంటిది ఏమైనా వచ్చిందా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత... లాల్ మృతికి కారణాలు ఏంటన్న విషయం పూర్తి స్థాయిలో తెలుస్తుందన్నారు పోలీసులు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు