పెళ్లైన రెండు రోజులకే ప్రాణాలు కోల్పోయిన వరుడు... కామారెడ్డిలో విషాదం...

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలు ప్రమాదం... కాచిగూడ-నిజామాబాద్ డెమో ప్యాసింజర్ రైలు ఢీకొని నవ వరుడు మృతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 11, 2019, 3:53 PM IST
పెళ్లైన రెండు రోజులకే ప్రాణాలు కోల్పోయిన వరుడు... కామారెడ్డిలో విషాదం...
పెళ్లైన రెండు రోజులకే ప్రాణాలు కోల్పోయిన యువకుడు... కామారెడ్డిలో విషాదం...
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. రెండేళ్లు ప్రేమించి, ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు... మూడుముళ్ల బంధంతో ఏకామయ్యామన్న ఆనందం రెండు రోజులు కూడా గడవకముందే ఆవిరైంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల కిషోర్ అనే యువకుడు... కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతనికి మనసివ్వడంతో రెండేళ్లు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో మొదట వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయితే ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించిన కిషోర్... ప్రియురాలిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మంగల వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి, రిసెప్షన్ ఇలా రెండు రోజుల పాటు యమా బిజీగా గడిపిన వధువు... అనారోగ్యానికి గురైంది. ఆమె కోసం మందులు తెచ్చేందుకు బయటికి వచ్చాడు కిషోర్.

రాత్రంతా నిద్ర లేకపోవడంతో కాస్త పరధ్యానంగా నడుస్తూ... రైలు పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న కాచిగూడ-నిజామాబాద్ డెమో ప్యాసింజర్ రైలును గమనించలేదు. అంతే వేగంగా వచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన కోసం మందులు తెచ్చేందుకు బయటికి వెళ్లిన భర్త... ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన అతని భార్య గుండెలు పగిలేలా విలపించింది. కష్టాలు, ఇబ్బందులన్నీ అధిగమించి ఒక్కటైన తాము... సంతోషంగా నూరేళ్లు కలిసి బతుకుదామని కలలు కంటుంటే... కిషోర్ ఇలా మృత్యువాత పడ్డాడని తెలిసి కుప్పకూలిపోయింది.


First published: May 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు