YOUNG MAN COMMITS SUICIDE IN NALGONDA AFTER HIS LOVER PARENTS MARRIED HER TO ANOTHER MAN SU
శ్రీకాకుళం అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. కానీ అలా జరగడంతో..
వినయ్‌రెడ్డి(ఫైల్ ఫొటో)
అమ్మాయిది శ్రీకాకుళం జిల్లా (Srikakulam).. అబ్బాయిది నల్గొండ (Nalgond) జిల్లా.. వారిద్దరు హైదరాబాద్‌లో (Hyderabad) ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
అమ్మాయిది శ్రీకాకుళం జిల్లా (Srikakulam).. అబ్బాయిది నల్గొండ (Nalgonda) జిల్లా.. వారిద్దరు హైదరాబాద్‌లో (Hyderabad) ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారు ఒకటి అనుకుంటే.. అమ్మాయి తరఫు పెద్దలు మాత్రం వేరే నిర్ణయం తీసుకన్నారు. అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తానికి లోనైన యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామానికి చెందిన మేరెడ్డి శేఖర్‌రెడ్డి చిన్న కుమారుడు వినయ్‌రెడ్డి (24) బీటెక్ (B.tech) పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని అక్కడే ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు (Love Each Other). పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.
ఇందుకోసం పెద్దలను ఒప్పించాలని అనుకున్నారు. అయితే యవతి తల్లిదండ్రులు ఆమె వేరే వ్యక్తితో బలవంతం గా వివాహం (Marriage) జరిపించారు. యువతి తనకు ఇష్టం లేదని చెప్పిన వినిపించుకోలేదు. అయితే యువతి.. కాపురానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటుంది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో లహరి ప్రియుడి వద్దకు వచ్చేసింది. వీరిద్దరూ కలసి కొన్ని రోజుల కిందట బెంగళూరు (Bengaluru) వెళ్లిపోయారు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరిద్దరు బెంగళూరులో ఉన్నట్టుగా యువతి బంధువులు గుర్తించారు. వీరి ఆచూకీ తెలుసుకున్న వినయ్‌రెడ్డిపై దాడిచేసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. వినయ్‌రెడ్డి వద్ద ఉన్న డబ్బులు, మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు.
ఇక, వినయ్‌రెడ్డి (Vinay Reddy) ఎలాగోలా బుధవారం అతని స్వగ్రామం గడ్డికొండారం చేరుకున్నారు. జరిగిన పరిణామాలతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకాడు. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభించడంతో ఏదో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.