అతడి తల్లిదండ్రులు చిన్నితనంలో నే మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ప్రస్తుతం అతని సోదరి, అతడు కలిసి ఉంటున్నారు. అతడి వయస్సు 23 ఏళ్లు. అయితే గత సంత్సరం నుంచి అతడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఆమె కూడా ఓకె అనడంతో తల్లిదండ్రులతో మాడ్లాడమే ఇక మిగిలింది. అతడు ఆమె ఇంట్లో చెప్పి ఒప్పించు అని చెప్పాడు. కానీ వీలు చూసుకొని చెబుదాం అనుకుంది. కానీ ఈ లోపే యువతి తల్లిదండ్రులకు విషయం తెలవడంతో ఆమెను మందలించారు. అతడితో మాట్లాడటం మానేసింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో ఓ రోజు ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. యువకుడి మృతికి ప్రేమించిన యువతి తల్లిదండ్రులే కారణమంటూ చనిపోయిన యువకుడి తరఫు బంధువులు మృతదేహంతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని లింగమయ్యకాలనీకి చెందిన కాట్రాజు పవన్‌కుమార్ (23), ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అదే అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయతే పవన్‌కుమార్ తల్లిదండ్రులు 12ఏళ్ల క్రితమే మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రస్తుతం సోదరి మాత్రమే ఉంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. యువకుడి మృతికి ప్రేమించిన యువతి తల్లిదండ్రులే కారణమంటూ అంబేద్కర్‌కూడలిలో పవన్‌కుమార్ మృతదేహంతో బంధువులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఘటనా స్థలానికి సీఐ బీషన్న చేరుకొని వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి కదిలారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime news, Lovers, Mahabubnagar