హోమ్ /వార్తలు /క్రైమ్ /

నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు.. ప్రియురాలి ఇంటి ముందు తుపాకీతో కాల్చుకొని యువకుడు మృతి

నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు.. ప్రియురాలి ఇంటి ముందు తుపాకీతో కాల్చుకొని యువకుడు మృతి

Youth ends his life in front of girl friend home: వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. నజీమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఇంటి ముందే విగత జీవిగా పడి ఉన్నాడు.

Youth ends his life in front of girl friend home: వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. నజీమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఇంటి ముందే విగత జీవిగా పడి ఉన్నాడు.

Youth ends his life in front of girl friend home: వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. నజీమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఇంటి ముందే విగత జీవిగా పడి ఉన్నాడు.

  ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు.ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. కానీ వీరి ప్రేమంలో ఏవో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. అతడికి ఆమె సరిగ్గా మాట్లాడడం లేదు. దూరం పెడుతూ వస్తోంది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఐతే ప్రియురాలి తీరుతో అతడు మానసికంగా కుంగిపోయాడు. నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు అని.. తనువు చాలించాడు. ప్రియురాలి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలన రేపుతోంది.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మీరట్‌లోని కొత్వాలి ప్రాంతంలో ఉన్న షాపీర్ గేట్‌లో శుక్రవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం లభ్యమయింది. తెల్లవారుజామున రోడ్డుపక్కన శవం కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతడి శరీరంపై బుల్లెట్ గాయాలయ్యాయి. మృతుడిని 26 ఏళ్ల నజీమ్‌గా పోలీసులు గుర్తించారు. కొద్ది దూరంలోనే ఓ మొబైల్ ఫోన్ లభ్యమయింది. కాల్ డేటాను పరిశీలిస్తే.. తెల్లవారుజామున 03.10 గంటలకు తన ప్రియురాలికి ఫోన్ చేసినట్లు తేలింది. మృతుడు చనిపోయిన స్థలానికి ఎదురుగానే ఆమె ఇల్లు ఉంది. ప్రియురాలి ఇంటి ముందే అతడు మరణించాడు. తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

  Shocking: స్నేహితుడి భార్యపై కన్నేసిన ఆర్మీ జవాను.. ఇంట్లోకి ప్రవేశించి.. ఆ తర్వాత..

  నజీమ్ ఆ యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నజీమ్‌ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. ఐనా అతడు పదే పదే ఫోన్‌లు చేసేవాడు. ఆ రోజు తెల్లవారుజామను కూడా తన ప్రియురాలికి ఫోన్ చేశాడు. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. నజీమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఇంటి ముందే విగత జీవిగా పడి ఉన్నాడు.

  ప్రేమ పేరుతో నమ్మించాడు.. మాట్లాడు కుందామని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి..

  ప్రియురాలి దూరమవడంతో.. తట్టుకోలేకపోయాడని.. ఆ బాధలోనే సూసైడ్ చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నజీమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఆత్మహత్యతో పాటు హత్య కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నజీమ్ ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలారోజు ఏం జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. నజీమ్ మృతితో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

  First published:

  Tags: Crime news, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు