news18-telugu
Updated: July 15, 2020, 6:44 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ రోజురోజూకీ విజృంభిస్తోంది. దీనికి తోడు సీజనల్ వ్యాధులు చుట్టుమడుతున్నాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్న వ్యాధుల బారిన పడడం ఖాయం. అయితే ఓ యువకుడు చికెన్ తీసుకొచ్చేందుకు చికెన్ సెంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ అపరిశుభ్రత తాండవం చేస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో చికెన్ సెంటర్ ఇలా ఉంటే ఏలా అని ఆ దుకాణం యాజమానిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో యువకుడికి, దుకాణ యాజమానికి మాటామాటా పెరిగింది. దీంతో చికెన్ దుకాణ యజమాని తన భార్యతో కలిసి యువకుడిపై దాడి చేసి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మజ్జిగ శివ(22) స్థానికంగా ఉండే ఓ మెస్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శివకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం(ఈనెల 10న) ఇంటికి దగ్గరలో ఉన్న ఓ చికెన్ దుకాణం వద్దకు చికెన్ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అయితే చికెన్ సెంటరు వద్ద అపరిశుభ్ర వాతావరణం కన్పించడంతో ఆ దుకాణం యజమాని ప్రకాశ్‌ను శివ ఇదేంటని ప్రశ్నించాడు. ప్రకాశ్, శివ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ప్రకాశ్, తన భార్యతో కలిసి శివపై దాడి చేసి దుర్భాలాడారు.
దీంతో మనస్తాపం చెందిన శివ ఈనెల 12ఇంటిలో నుంచి వెళ్లిపోయాడు. భార్య స్వప్నకు ఫోన్ చేసి నేను చనిపోతున్నా.. పిల్లలను జాగ్రత్తగా చూసుకొమ్మంటూ ఫోన్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు శివ కోసం వెతికారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. చివరకు మంగళవారం మంచిర్యాల-పెద్దంపేట రైలు పట్టాల మధ్య శవమై కన్పించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Published by:
Narsimha Badhini
First published:
July 15, 2020, 6:44 AM IST