Home /News /crime /

YOUNG MAN COMMITS SUICIDE AFTER LOVER REJECTED TO COME FOR OUTING WITH HIM IN WEST GODAWARI DISTRICT OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: కాబోయే భార్యను కలవొద్దన్న పెద్దలు... యువకుడి షాకింగ్ నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Love Suicide: ఫేస్ బుక్ (Face Book) పరియచం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లికి పెద్దలను ఒప్పించారు. అంతా బాగుందనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్

    ఫేస్ బుక్ పరియచం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లికి పెద్దలను ఒప్పించారు. అంతా బాగుందనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్.. ఏమైందో ఏమో తెలియదు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని పాలములపర్రు గ్రామానికి చెందిన పొగిరి దిలీప్ కుమార్ కు.. పాలకొల్లు మండలానికి చెందిన ఓ యువతితో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. విషయం పెద్దలకు చెప్పగా..ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. త్వరలోనే వివాహానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో కలిసి దిలీప్ బయటకు వెళ్లాడు. దీనిని గమనించిన అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కాకుండా అలా బయటతిరగడం సరికాదని చెప్పారు.

    పెద్దల మాటను గౌరవించిన యువతి.. ఈ విషయాన్ని దిలీప్ తో చెప్పింది. ప్రేమలో ఉన్నప్పుడు బయటకెళ్లగా లేని సమస్య పెళ్లి కుదిరిన తర్వాత ఎందుకొచ్చిందని ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మనస్తాపం చెందిన దిలీప్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిలీప్ చిన్నాన్న లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది చదవండి: సైబర్ నేరాల్లో ఇదో కొత్త వెర్షన్.. ఫోన్ కాల్ కట్ అయ్యేలోపు ఎకౌంట్ ఖాళీ



    ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందనే విషయంపై యువతిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఇద్దరి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ డేటాను కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లికి సిద్ధమైన సమయంలో దిలీప్ ఆత్మహత్య చేసుకోవడంతో యువతి శోకసంద్రంలో మునిగిపోయింది. బయటకు వెళ్లొద్దన్నందుకు ప్రాణం తీసుకున్నాడని రోదిస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో దిలీప్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Love affair, Suicide, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు