వాళ్లిద్దరిదీ ఒకే ఊరు. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తరపు వాళ్లు వారిద్దరి ప్రేమను ఒప్పుకోలేదేమో, అందుకే ఆ అబ్బాయి నేరుగా ఆమెను ఇంటికి తీసుకుని వచ్చేశాడు. తన తల్లిదండ్రుల అంగీకారం మేరకు త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టించుకుందామనుకున్నారు. 15రోజులుగా వాళ్లింట్లోనే భార్యాభర్తలుగా మెలగుతున్నారు. అంతా హ్యాపీ అనుకున్న సమయంలో ఊహించని ఘోరం జరిగింది. కారణమేమిటో కానీ రాత్రికి రాత్రే ఆ జంట శవాలుగా మారారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషం తాగి గిలగిలా కొట్టుకుంటున్న వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరేలోపే వారిద్దరూ కన్నుమూశారు. ఒడిశా రాష్ట్రంలోని నవరంగ్ పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నవరంగ్ పూర్ జిల్లా ఝోరిగాం సమితి కుటిరచోపర్ గ్రామ పంచాయతీ కిలిగౌడసాహి గ్రామంలో ఖామ్ సింగ్ గౌడ అనే వ్యక్తికి ఇంద్రగౌడ అనే కుమారుడు ఉన్నాడు. అతడు అదే గ్రామానికి చెందిన జయసింగ్ గౌడ చిన్నకుమార్తె దుతిక గౌడను ప్రేమించాడు. ఇద్దరూ చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం గురించి గ్రామంలో చాలా మందికి తెలుసు. అయితే వీరి ప్రేమ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుచెప్పారో, మరే కారణమో కానీ ప్రేమించిన అమ్మాయిని ఇంద్రగౌడ తన ఇంటికి తీసుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: శునకంపై అత్యాచారం.. అర్ధరాత్రి ఓ యువకుడి నిర్వాకం.. చాటుగా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన కుర్రాళ్లు.. చివరకు..
15 రోజుల క్రితం దుతికను ఇంద్రగౌడ తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఇంద్రగౌడ తల్లిదండ్రులు కూడా ఆమె రాకను స్వాగతించారు. ఆ రోజు నుంచే వారిద్దరూ నూతన దంపతుల్లా ఇంట్లో ఉండసాగారు. త్వరలోనే అందరి సమక్షంలో పెళ్లిచేయాలని కూడా వారు భావించారు. కానీ ఏమయిందో ఏమో కానీ సోమవారం రాత్రి ఇద్దరూ విషం తాగారు. ఇంట్లో గిలగిలా కొట్టుకుంటూ కనిపించిన వారిద్దరినీ కుటుంబ సభ్యులు ఝోరిగాంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మరణించారని వైద్యులు వెల్లడించారు. పోస్ట్ మార్టం పూర్తి చేసి మంగళవారం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ఘోరం.. రాత్రి పూట బర్త్ డే పార్టీ.. తెల్లారేసరికి హాస్టల్ గదిలో శవంగా.. అసలేం జరిగిందంటే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.