• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • YOUNG MAN BRUTALLY MURDERED ONE PERSON DUE TO HAVING ILLEAGAL AFFAIR WITH HIS GIRLFRIEND IN VIZIANAGARAM HSN

ఒకరికి తెలియకుండా మరొకరితో ఓ మహిళ అక్రమ సంబంధం.. ఓ కుర్రాడికి నిజం తెలిసింది.. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది..!

ఒకరికి తెలియకుండా మరొకరితో ఓ మహిళ అక్రమ సంబంధం.. ఓ కుర్రాడికి నిజం తెలిసింది.. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది..!

ప్రతీకాత్మక చిత్రం

ఒకరికి తెలియకుండా మరొకరితో ఆ మహిళ ఇద్దరు కుర్రాళ్లతోనూ అఫైర్ నడిపిస్తోంది. అయితే ఈ విషయం ఓ కుర్రాడికి తెలిసింది. ఆ మహిళతో తనకు మాత్రమే సంబంధం ఉండాలని ఫిక్సయ్యాడు. చివరకు..

  • Share this:
    ఓ యువకుడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అదే మహిళ మరో కుర్రాడితోనూ అఫైర్ నడిపిస్తోందని ఆ యువకుడికి తెలిసింది. అంతే దాన్ని తట్టుకోలేకపోయాడు. తనతో మాత్రమే ఆ మహిళ కలిసి ఉండాలనుకున్నాడు. ఆ కుర్రాడిని అడ్డు తొలగించుకోవాలని ఫిక్సయ్యాడు. నెమ్మదిగా అతడితో పరిచయం పెంచుకున్నాడు. మందు పార్టీలకు పరస్పరం అహ్వానించుకుని ఫ్రెండ్సయ్యారు. అనుమానం రాకుండానే మరోసారి మందు పార్టీకి ఆ కుర్రాడిని పిలిచాడు. తన తోటి స్నేహితులతో కలిసి ఆ కుర్రాడిని మట్టుబెట్టాడు. మృతదేహానికి పెద్ద రాళ్లను కట్టి మరీ ఓ బావిలో పడేశాడు. హమ్మయ్య, అడ్డు తొలగిందిలే అనుకున్నాడు. కానీ నెల రోజుల తర్వాత అతడి బండారం బయటపడింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    విజయనగరం జిల్లా రూరల్ మండలంలోని పినవేమలికి చెందిన కెంగువ రవి అనే 25 ఏళ్ల కుర్రాడికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే అదే మహిళతో బాలి పైడి రాజు అనే వ్యక్తికి కూడా వివాహేతర సంబంధం ఉంది. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆ మహిళ ఇద్దరు కుర్రాళ్లతోనూ అఫైర్ నడిపిస్తోంది. అయితే ఈ విషయం కాస్తా బాలి పైడిరాజుకు తెలిసింది. దీంతో కెంగువ రవిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆ మహిళతో తనకు మాత్రమే సంబంధం ఉండాలని ఫిక్సయ్యాడు. దీంతో రవితో రాజు పరిచయం పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి ఓ సారి మందు పార్టీకి రవిని రాజు ఆహ్వానించాడు. ఆ తర్వాత రవి కూడా తన స్నేహితులతో కలిసి చేసుకున్న మందు పార్టీకి రాజును ఆహ్వానించాడు. ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది.

    ఆ తర్వాతే తన ప్లాన్ ను రాజు అమలు చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 17వ తారీఖున పథకం ప్రకారం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఊరి పొలిమేరల్లో మందు పార్టీని రాజు ఏర్పాటు చేశాడు. దీనికి రవిని పిలిచాడు. ఏమీ ఎరుగని రవి ఆ పార్టీకి వచ్చాడు. రవితో ఫుల్లుగా మద్యం తాగించాడు. స్నేహితుల సాయంతో రవిని రాజు చంపేశాడు. ఆ తర్వాత శవానికి బలమైన బండరాళ్లను కట్టి మరీ ఓ పాడుబడ్డ బావిలో పడేశారు. పని పూర్తయిందనుకున్నాడు. ఎవరూ గుర్తించలేరనుకున్నాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదంటూ రవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పోలీసులు విచారణ చేసినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఈ క్రమంలోనే ఇటీవల బావిలో ఓ గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. అది రవిదేనని అతడి తల్లిదండ్రులు, పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు రాజును అరెస్ట్ చేశారు. రవి సెల్ ఫోన్ ఉన్న ప్రాంతాల్లోనే రాజు మొబైల్ సిగ్నల్స్ ఉండటంతో అతడిని, అతడికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కు తరలించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు