Telangana:అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన వృద్దురాలిని వదల్లేదు ఓ కామాంధుడు. పాతికేళ్లు కూడా సరిగాలేని ఓ యువకుడు 60సంవత్సరాల వృద్ధురాలికి మందులు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామంతో కళ్లు మూసుకుపోవడంతో ఓ యువకుడు నేరస్తుడిగా మారాడు. వయసులో ఉన్న యువకుడు వయో భేదం కూడా చూడకుండా సిగ్గులేని పని చేసి కటకటాలపాలయ్యాడు. నిర్మల్(Nirmal)జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి వచ్చిన ఓ వృద్ధురాలి(Old woman)పై ఆకతాయిగా తిరుగుతున్న 23ఏళ్ల యువకుడు(Young man)కన్నేశాడు. ఆసుపత్రిలో ఎవరూ లేని సమయం చూసి తనలోని రాక్షసుడ్ని ఉసిగొల్పాడు. వైద్యం కోసం వచ్చిన 60ఏళ్ల వృద్దురాలికి మందులు (Drugs)ఇప్పిస్తారా అని చెప్పి ఆసుపత్రిలోని నిరుపయోగంగా ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం(Assaults)చేశాడు. నిర్మల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి లక్ష్ణణచాంద(Lakshanachanda)మండలానికి చెందిన ఓ 58సంవత్సరాల(58Years old) వృద్ధురాలు మందు కోసం సోమవారం(Monday)సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రోగుల వెయిటింగ్ హాలు(Waiting Hall)లోని బెంచీపై పడుకుంది. వృద్ధురాలి నిస్సహాయస్థితిని గమనించిన శ్రీకాంత్(Srikanth)అనే 23ఏళ్ల(23Years old) యువకుడు ఆమె దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తాను రమ్మని వెంటబెట్టుకెళ్లాడు. వృద్ధురాలిని మరో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆసుపత్రిలో వైద్యసిబ్బంది ఎవరూ లేకపోవడం, కామాంధుడు వృద్ధురాలి నోరు మూసివేయడంతో ఆమె అరుపులు ఎవరికి వినిపించలేదు. అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో ఆసుపత్రికి వచ్చిన మరికొందరు ఆమె దగ్గరకు చేరుకున్నారు. బాధితురాలు జరిగిన విషయాన్ని వారితో చెప్పడంతో పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి కంప్లైంట్(Compliant)ఆధారంగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఆసుపత్రిలో అరాచకుడు..
సోమవారం సాయంత్రం ఘటన జరిగింది. మంగళవారం నిందితుడ్ని గుర్తించారు పోలీసులు. వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడి పేరు శ్రీకాంత్‌గా తేల్చారు. అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ గ్రామంలో పని, పాట లేకుండా తిరగడం వల్ల మద్యానికి బానిసయ్యాడు. అదే క్రమంలో వృద్ధురాలిపై ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు తెలిపారు.
ముసలవ్వపై అత్యాచారం..
మరోవైపు వృద్ధురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం జరగడంపై ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. హాస్పిటల్లో వైద్య సిబ్బంది ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్లారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అత్యాచారం కాదు.. ఎవరైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రోగులు వస్తే వాళ్ల పరిస్థితి ఏం కావాలని మిగిలిన రోజులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని..రోగుల రక్షణ కోసం ఓ సెక్యురిటీ గార్డును కూడా నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.