అసలే సైకో సుధీర్, ఆపై అర్ధరాత్రి తల్లి మందలింపు. ఒక్కసారిగా ఆవేశానికి గురై అత్యంత దారుణంగా ఇనుపరాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టాడు. తల పగిలి రక్తం ధారగా పోతుండగా, ఇంట్లోనే ఉన్న కూతురు (సుధీర్ సోదరి) తల్లికి సాయంగా వచ్చింది. ఆమెను కూడా సుధీర్ గాయపర్చాడు.
చిన్నప్పటి నుంచే వాడు కొంచెం తేడా. వయసు పెరుగిని కొద్దీ చిన్న పాటి సైకోలా మారాడు. అయినాసరే, కన్నపేగు కావడంతో అతణ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందా తల్లి. తీరా ఆ పిచ్చోడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైందా మాతృమూర్తి. అర్ధరాత్రి పూట వ్యాయామం ఎందుకురా అని వారించడమే ఆమె పాపమైంది. హైదరాబాద్ లో సంచలనం రేపిన ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోన్న పాపమ్మకు ఒక కొడుకు, ఒక కూతురున్నారు. కొడుకు సుధీర్ చాలా కాలంగా సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్నా కుటుంబం కాపాడుకుంటూ వస్తోంది. ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో సుధీర్ ఇంట్లోనే ఎక్సర్సైజ్ (వ్యాయామం) మొదలుపెట్టాడు. అర్ధరాత్రి ఆ పనెందుకురా, వెళ్లి పడుకో అని మందలించింది తల్లి పాపమ్మ. అంతే..
అసలే సైకో సుధీర్, ఆపై అర్ధరాత్రి తల్లి మందలింపు. ఒక్కసారిగా ఆవేశానికి గురై అత్యంత దారుణంగా ఇనుపరాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టాడు. తల పగిలి రక్తం ధారగా పోతుండగా, ఇంట్లోనే ఉన్న కూతురు (సుధీర్ సోదరి) తల్లికి సాయంగా వచ్చింది. ఆమెను కూడా సుధీర్ గాయపర్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ శారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే తల్లి పాపమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ చెల్లిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా సుధీర్ సైకోగా మారి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సుధీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కూడా కొద్దిపాటి గాయాలు కావడంతో అతన్నీ కూడా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సుధీర్ మానసిక పరిస్థితి దృష్ట్యా అతణ్ని మెంటల్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.