మరో ప్రేమజంట.. పెద్దల పంతానికి బలైపోయింది. కలిసి బతకలేక.. తోడుగా చనిపోయారు. నల్గొండ జిల్లాలో యువ ప్రేమికుల బలవన్మరణం ఘటన అందరినీ కలిచివేసింది. పోలీసులు, గ్రామస్తులు చెప్పిన వివరాలివి.. నల్గొండ జిల్లా అనుముల మండలం తెట్టేకుంటలో జరిగిందీ విషాదకకర సంఘటన.
తెట్టేకుంటకు చెందిన మట్టపల్లి కొండలు (21), అదే గ్రామానికి చెందిన సంధ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. భవిష్యత్తులో పెళ్లితో ఒక్కటయ్యేందుకు ఇరువురూ తమ కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో..
తమ ప్రేమకు పెద్దల అంగీకారం లేదని, ఇక కలిసి బతకడం కష్టమని భావించిన కొండలు, సంధ్య.. రెండు రోజుల కిందట తెట్టేకుంట సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విగత జీవులుగా పడిఉన్న వాళ్లిద్దరినీ స్థానికులు గుర్తించి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ..
విషం తాగి ఆస్పత్రిపాలైన కొండలు, సంధ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున దాదాపు ఒకే సమయంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతిపై స్నేహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lovers suicide, Nalgonda, Nalgonda police