• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • YOUNG LADY MURDERED IN HOUSE AT GUNTURU ANDHRA PRADESH SB

గుంటూరులో దారుణం... ఇంట్లోనే యువతి హత్య

గుంటూరులో దారుణం... ఇంట్లోనే యువతి హత్య

తనూష మృతదేహం, సోదరుడు కుమారస్వామి

అనూష అనే యువతిని ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు అతని సోదరుడు కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Share this:
    గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. నరసరావు పేటలో ఇంట్లోనే 16 ఏళ్ల యువతి హత్యకు గురైంది. పట్టణంలోని లింగంగుంట్ల కాలనీలో లక్కన చిన్న బసవయ్య పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాడు .ఐతే చిన్నబసవయ్య కుటుంబం శుక్రవారం తన అత్తగారి ఊరు క్రిష్ణాజిల్లా తిరువూరులో బంధువుల ఇంట్లో పెద్దకర్మ కార్యక్రమానికి వెళ్ళారు.కార్యక్రమం ఐన వెంటనే అతని కుమార్తె ఐన  తనూష, కుమారుడు కుమారస్వామి ఇద్దరు రాత్రి 8.00 లకు నరసరావుపేటచేరుకున్నారు. అయితే ఏమైదో తెలియదు గాని తెల్లవారే సరికి తనూష శవమై కనిపించింది.

    తనూషను ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు అతని సోదరుడు కుమారస్వామి పోలీసులకు తెలిపాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి సోదరుని విచారించగా అర్ధరాత్రి 2.00 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటిలోకి ప్రవేశించి తనపై తన సోదరిపై దాడి చేశాడన్నారు. ఆ దాడిలో తన సోదరి మృతి చెందిందని పోలీసులకు తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ ప్రారంభించారు.  యువతి హత్యకు కారణాలు ఏమై ఉంటాయా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

    అయితే బయట వ్యక్తులు ఎవరూ రాత్రి ఇంట్లోకి రాలేదని క్లూస్  టీం గుర్తించింది. ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కొత్త వ్యక్తుల ఆనవాళ్ళు ఏమీ లభించలేదని,స్నిఫర్ డాగ్ కూడా మృతురాలి సోదరుడు కుమార స్వామి వద్దకే వెళుతుందని చెప్పడం తో ఈ హత్య కేసులో అతనిపై అనుమానాలు బలపడ్డాయి. దీంతో కుమారస్వామిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు యువతి సోదరుడు కుమారస్వామి మీదే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు