ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు మరో మహిళను చంపేసిన యువతి

తన ప్రియుడితో కలిసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని భావించిన ఓ యువతి... ఇందుకోసం మరో మహిళను హత్య చేయడం కలకలం రేపింది.

news18-telugu
Updated: April 12, 2019, 8:38 AM IST
ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు మరో మహిళను చంపేసిన యువతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 12, 2019, 8:38 AM IST
ఢిల్లీలో దారుణం జరిగింది. తన ప్రియుడితో కలిసి జీవితాన్ని ఆనందంగా గడపాలని భావించిన ఓ యువతి... ఇందుకోసం మరో మహిళను చంపేందుకు ప్లాన్ చేసింది. ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి మరో మహిళను హత్య చేసింది నిందితురాలు. ఢిల్లీకి చెందిన రిచా అనే మహిళ... సుమిత్ అనే యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. అయితే ఇద్దరు కలిసి లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి కొంత డబ్బు అవసరమని భావించిన రిచా... ఇందుకోసం డబ్బున్న వారిని దోచేయాలని భావించింది. ఈ క్రమంలో సుమిత్ షాపుకు తరచూ వచ్చే గీతా సక్సెనా అనే మహిళను టార్గెట్ చేసింది. ఖరీదైన జీవితం గడుపుతున్న గీతా ఇంట్లో దోపిడీకి పాల్పడితే... కావాల్సినంత డబ్బు వస్తుందని రిచా, సుమిత్ ఇద్దరూ ప్లాన్ చేశారు. ఇందుకోసం మరో ఇద్దరి సాయం తీసుకున్నారు.

ఎవరూ లేని సమయంలో గీత ఇంటికి వెళ్లిన రీచా... తాను కొత్తగా పక్క ఫ్లాట్‌లోకి వచ్చానని ఆమెను నమ్మించింది. ఈ విషయాన్ని నమ్మిత గీత... ఆమెను కొంత సేపు వెయిట్ చేయాలని కోరింది. ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని నిర్ధారించుకున్న రిచా... వెంటనే సుమిత్‌తో పాటు మరో ఇద్దరిని రమ్మని సంకేతాలు పంపించింది. వారంతా కలిసి గీత ఒంటిపై ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకోవడం మొదలపెట్టారు. అయితే వీరి చర్యలకు భయపడి గీత కేకలు వేయడంతో... ఓ బట్టతో ఆమె గొంతును చుట్టేసి చంపేశారు నిందితులు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఘటనకు సంబంధించి వేగంగా విచారణ మొదలుపెట్టిన పోలీసులు... ఈ నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. సుమిత్‌తో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపాలనే ఉద్దేశ్యంతోనే రిచా... ఈ హత్యకు ప్లాన్ చేసిందని నిర్ధారణకు వచ్చారు.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...