ప్రేమించిన యువకుడిపై కత్తితో దాడిచేసిందో యువతి. అనంతరం నిద్ర మాత్రలు మింగి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంకు చెందిన మాగంటి నాగలక్ష్మి ఆర్కే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. పెడతన తహశీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరుకు చెందిన యువకుడు పవన్‌ను ఆమె ప్రేమిస్తోంది. గత రెండేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. కొన్ని రోజులుగా పెళ్లి కోసం పవన్‌పై నాగలక్ష్మి ఒత్తిడి తెస్తోంది. ఐతే అందుకు పవన్ తిరస్కరించాడు. ఈ క్రమంలో చివరిసారిగా మాట్లాడుకుందామని.. పవన్‌ను తన గ్రామానికి పిలిచింది నాగలక్ష్మి. అక్కడికి వెళ్లిన తర్వాత.. తనను పెళ్లి చేసుకోవా అంటూ పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరం చనిపోదామని చెప్పింది. తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పవన్‌కు గాయాలయ్యాయి. అనంతరం తానూ నిద్రమాత్రలు మింగి నాగలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను హుటాహుటిన మచిలీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.