Home /News /crime /

YOUNG GIRL PROTEST ON WATER TANK FOR MARRIAGE HER BOY FRIEND IN WEST GODAVARI DISTRICT PALAKOLLU NGS

Girl Friend Demand: ప్రియుడి కోసం ప్రియురాలు చేసిన పని చూస్తే షాక్ అవుతారు.. పోలీసుల ముందే హంగమా..? చివరికి ఏమైందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Protest for lover: ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం ఎవరూ ఊహించని విధంగా పోరాటం చేసింది. ఏడేళ్ల పాటు ప్రేమించి.. ఇప్పుడు పెళ్లి చేసుకోడానికి నిరాకరించడంతో వినూత్న రీతిలో నిరసన తెలిపింది. పోలీసులకు చెమటలు పట్టించింది.

  Young Women Protest:ఓ ప్రియుడి కోసం ప్రియురాలు (lover) చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది. సాధరణంగా ప్రేమికురాలి కోసం ప్రేమించిన ప్రియుడు పరితపించిపోవడం చూస్తూ ఉంటాం.. అమ్మాయి మొహం చాటేసిందని ఆవేదన చెందుతూ ఉంటారు. ఆమెను దక్కించుకోడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలో కొందరు ఉన్మాదులుగా మారి హత్య చేయడానికో.. ఆత్మహత్య చేసుకోడానికో కూడా వెనుకాడడం లేదు. కానీ ఓ యువతి (Young Girl).. తన ప్రేమించిన వ్యక్తి మొహం చాటేస్తున్నాడని ఆందోళనకు దిగింది. అయితే ఇటీవల కాలంలో చాలా మంది తమకు ఏ సమస్య వచ్చినా దగ్గర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి (Protest on Water tank) .. హల్ చల్ చేస్తారు. ముఖ్యంగా ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని చాలామంది వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గ్రామ పెద్దలకు తమ సమస్య తెలియజేయాలి అన్నా వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య కాపురానికి రాలేదనో.. పరీక్షలో ఫెయిల్ అయ్యామనో.. ఆఖరికి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయలేదనో .. ఇలా ప్రతి కారణానాకి వాటర్ ట్యాంకును వాడేస్తున్నారు కొందరు. తాజాగా ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి హంగామా సృష్టించింది. వాటర్ ట్యాంక్‌ ఎక్కి హల్‌ చల్‌ చేసింది. తల్లిదండ్రులు బంధువులు వారించినా.. సన్నిహితులు నచ్చ చెప్పినా.. గ్రామ పెద్దలు మాట ఇచ్చినా ఆమె కిందకు దిగలేదు. దీంతో పోలీసులు వచ్చే వరకు అక్కడ హై డ్రామా కనిపించింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) పాలకొల్లు (Palakollu)లోని బెత్లహంపేటలో జరిగింది.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పాలకొల్లు బెత్లహంపేటలో పెట్టెల కేశవాణి (kesavani) నివాసం ఉంటున్నారు. ఈమె..తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్ (baskhar)ను ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. పీకల్లోతూ ప్రేమలో ఉన్న ఆమె.. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలంటూ భాస్కర్ ను కోరింది. దీనికి భాస్కర్ నో చెప్పాడు. దీంతో ఆమె మనస్థాపానికి గురైంది. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం లేదంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ..సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బెత్లహంపేటలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కింది ఆందోళనకు దిగింది కేశవాణి. భాస్కర్ తో వివాహం జరిపిస్తేనే..దిగొస్తానని ఖరాఖండిగా చెప్పింది.

  ఇదీ చదవండి: ఎవరో వస్తారని.. ఎదో చేస్తారని ఎదురుచూడలేదు.. చేయి చేయి కలిపారు.. అద్భుతం చేశారు

  ప్రియుడితో పెళ్లి చేస్తేనే దిగి వస్తానని, లేకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు వాట్సప్‌ వీడియో పంపింది. వారంతా చేరుకుని ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఇంతలో ఈ విషయం పోలీసులకు చేరడంతో.. పట్టణ ఎస్ఐ రెహ్మాన్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఏసుబాబు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్ లో మాట్లాడారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి తల్లిదండ్రులకు కబురు పంపారు. యువతికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా ఎంతమంది చెప్పినా ఆమె వెనక్కు తగ్గలేదు.. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు హుటాహుటిని.. ఆమె బాన భాస్కర్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అతడ్ని పెళ్లికి ఒప్పించారు. దీంతో ఆమె కిందకు దిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ చేసి, సమీపంలోని ఆలయంలో వివాహం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని హెచ్చరించారు. మొత్తానికి యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి తన సమస్యను పరిష్కరించుకుంది. ఏడేళ్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Lover, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు